ప్రేమ ఆవిరైందో ఏమో.. | husband harasement his wife  in tumkur district | Sakshi
Sakshi News home page

ప్రేమ.. పెళ్లి.. నరకం

Dec 15 2017 6:54 AM | Updated on Sep 26 2018 6:09 PM

husband harasement his wife  in tumkur district - Sakshi

సాక్షి, తుమకూరు: మాయమాటలతో కాలేజీ అమ్మాయిని ప్రేమించి పెళ్లాడిన వంచకుడు ఆమెకు నరకం చూపించాడు. అతను బస్‌ డ్రైవర్, యువతి ఎం.ఏ. పట్టభద్రురాలు, ఇద్దరి మధ్య ఒక టూర్‌లో ప్రేమ పుట్టింది. నాలుగు సంవత్సరాల ప్రేమ తరువాత పెళ్ళి చేసుకున్నారు. అయితే ప్రేమ ఆవిరైందో ఏమో.. ఆ భర్త భార్యను శారీరకంగా, మానసికంగా హింసిస్తుండడంతో బాధితురాలు భరించలేక పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిక్కనాయకనహళ్ళి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

పెళ్లయినా, మళ్లీ ప్రేమ 
జిల్లాలోని ఉర్డిగెరె గ్రామానికి చెందిన మంజుల అనే యువతి కాలేజీలో చదువుకునే రోజుల్లో విద్యార్థులతో కలిసి విహారయాత్రకు వెళ్ళింది. చిక్కనాయకనహళ్ళి తాలూకాలోని దేవరహళ్ళి గ్రామానికి చెందిన బస్‌డ్రైవర్‌ రంగనాథ్‌ స్వామి విద్యార్థుల బస్‌కు డ్రైవర్‌గా వెళ్లాడు. యాత్రలో అతని కన్ను మంజులపైన పడింది. బస్సులో ఉన్న సమయంలో పరిచయం పెంచుకుని, సుమారు నాలుగు సంవత్సరాల పాటు ఇద్దరు ప్రేమించుకున్నారు. 

ఆమె గర్భం కూడా దాల్చింది. ఆమె పెళ్లి చేసుకోమని కోరగా, రంగనాథ్‌ తనకు అప్పటికే పెళ్లయిన విషయాన్ని చల్లగా చెప్పాడు. చివరికి రంగనాథ్‌ తన మొదటి భార్యను ఒప్పించి ఇటీవలే మంజులకు కూడా తాళి కట్టాడు. అప్పటి నుంచి మంజులను తీవ్రంగా వేధించడంతో పాటు,  కొట్టడం కూడా జరిగింది. అయినా మంజుల భరిస్తు వచ్చింది. కొన్ని రోజుల నుంచి అతడు మరింత క్రూరంగా ప్రవర్తిస్తూ భార్యను తీవ్రంగా కొట్టి ఒంటినిండా గాయాలు అయ్యేలా చేశాడు. దాంతో బాధితురాలు మంజుల చిక్కనాయకనహళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement