అనుమానాస్పద స్థితిలో హెచ్‌ఎం మృతి | HM died in a suspicious state | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో హెచ్‌ఎం మృతి

Jun 2 2018 12:23 PM | Updated on Sep 15 2018 5:45 PM

HM died in a suspicious state - Sakshi

వెంకట్రామయ్య (ఫైల్‌)

గద్వాల క్రైం: అనుమానాస్పద స్థితిలో ఓ హెచ్‌ఎం మృతి చెంది న ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రం లో శుక్రవారం చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో గెజిటెడ్‌ హెచ్‌ఎంగా విధులు నిర్వహిస్తున్న వై.వెంకట్రామయ్య న్యూహౌసింగ్‌బోర్డు కాలనీలో అద్దెలో గదిలో ఉండేవాడు. అయితే, రెండు రోజులుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తుండగా గురు, శుక్రవారాల్లో మృతి చెందినట్లు తెలుస్తోంది.

పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా హెచ్‌ఎం విధులకు హాజరు కాకపోవడంతో వెంకట్రామయ్య నివాస గృహం వద్దకు అటెండర్‌ వెళ్లాడు. తలుపు తట్టినా తీయకపోవడంతో అనుమానం వచ్చి కిటికీలోనుంచి చూడగా ఎలాంటి చలనం లేకుండా పడి ఉండడంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా వచ్చిన వారు వెంకట్రామయ్య మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ మేరకు మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement