‘ఖాకీ’ కొలువు కోసం ఖతర్నాక్‌ ఐడియా

Hitech Mass Copying Caught In UP Police constable Exam - Sakshi

గోరఖ్‌పూర్‌, ఉత్తరప్రదేశ్‌ : ప్రభుత్వ ఉద్యోగం...అందునా పోలీస్‌ కొలువుకు ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో అందరికి తెలిసిందే. కానీ ప్రభుత్వ ఉద్యోగం సాధించడం అంత సులువేం కాదు. సర్కార్‌ కొలువు కోసం ఏళ్ల తరబడి కష్టపడుతున్న వారిని ఎంతోమందిని నిత్యం చూస్తునే ఉంటాం. కానీ ఇవేవి లేకుండా సులభంగా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనే ఉద్దేశంతో హైటెక్‌ మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడ్డారు గోరఖ్‌పూర్‌కు చెందిన ముగ్గురు యువకులు. కానీ పోలీసులు వీరిని చాకచక్యంగా పట్టుకున్నారు.

వివరాల ప్రకారం ఉత్తరప్రదేశ్‌ పోలీస్‌ పబ్లిక్‌ సర్విస్‌ కమీషన్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీ కోసం పరీక్షలు నిర్వహించింది. గోరఖ్‌పూర్‌కు చెందిన కొందరు యువకులు ఎలాగైనా ఈ పరీక్షల్లో పాస్‌ కావాలనే ఉద్దేశంతో హైటెక్‌ మాస్‌ కాపియింగ్‌కు పాల్పడ్డారు. పరీక్ష హాల్‌లోకి తమతో పాటు సూక్ష్మమైన ఎలాక్ట్రానిక్‌ పరికారాలను తీసుకువచ్చారు. చెవి లోపల అమర్చి వాడే ఈ పరికరాల సాయంతో సమాధానాలు తెలుసుకుంటూ పరీక్ష రాస్తున్నారు. అనుమానం వచ్చిన నిర్వాహకులు వీరిని తీసుకెళ్లి తనిఖీ చేయగా ఈ యువకులు వద్ద ఎలాక్ట్రానిక్‌ పరికరాలు బయటపడ్డాయి. దాంతో పోలీసులు ఈ యువకులను అదుపులోకి తీసుకున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top