నవ వరుడు ఆత్మహత్య | Groom Commits Suicide in Tamil nadu | Sakshi
Sakshi News home page

నవ వరుడు ఆత్మహత్య

Jul 6 2019 7:17 AM | Updated on Jul 6 2019 7:17 AM

Groom Commits Suicide in Tamil nadu - Sakshi

వివాహమైన మూడు నెలలకే నవ వరుడు

చెన్నై ,తిరువొత్తియూరు: వివాహమైన మూడు నెలలకే నవ వరుడు కుటుంబ కలహాలతో గురువారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. పల్లావరం క్రోంపేట రంగానగర్‌కు చెందిన ప్రకాష్‌(24) ఇనుప వస్తువుల తయారీ పట్ర నడుపుతున్నాడు. రమ్య అనే యువతిని ప్రేమించి మూడు నెలల క్రితం వివాహం చేసుకున్నాడు. గురువారం రమ్య సమీపంలో ఉన్న తన తల్లిదండ్రుల ఇంట్లో జరుగుతున్న ఓ కార్యక్రమానికి వెళ్ళింది. భార్య లేకపోవడంతో గురువారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చాడు ప్రకాష్‌.  ఇది చూసిన అతని తల్లిదండ్రులు గట్టిగా మందలించారు. దీంతో విరక్తి చెందిన ప్రకాష్‌ ఇంట్లోని గదిలోకి వెళ్లి ప్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న శంకర్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement