పెళ్లై ఇరవైరోజులు కూడా గడవకముందే..  | Groom Commits Suicide Chittoor | Sakshi
Sakshi News home page

పెళ్లై ఇరవైరోజులు కూడా గడవకముందే.. 

Jul 6 2019 8:05 AM | Updated on Jul 6 2019 8:05 AM

Groom Commits Suicide Chittoor - Sakshi

సాక్షి, పెద్దమండ్యం(చిత్తూరు) : పచ్చని పందిళ్లు.. మామిడి తోరణాలు వాడలేదు.. రంగవల్లులు చెరగలేదు.. ఆ నవ వరుడు కాళ్ల పా రాణి ఆరలేదు.. ఆ ఇంట ఇంకా వివాహ వైభవం తాలూకు స్మృతులు చెరగలేదు.. ఏమైందో ఏమో ఆ వరుడికి పెళ్లైన 20 రోజులకే నూరేళ్లు నిండాయి. దీంతో ఆ రెండు కుటుం బాల్లో విషాదం కమ్ముకుంది. పురుగుల మందు తాగి నవవరుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని వెలిగల్లు పంచాయతీ చల్లవారికుంటలో గురువారం రాత్రి జరిగింది.

పోలీసుల కథనం మేరకు..  చల్లావారికుంట గ్రామానికి చెందిన నీళ్ల అమరనారాయణ కుమారుడు మహేష్‌ (26)కు, వైఎస్సార్‌ కడప జిల్లా చిన్నమండ్యం మండలం దిగువగొట్టివీడుకు చెందిన జంగం శ్రీనివాసులు కుమార్తె మీనాక్షితో గతనెల 16న వివాహమైంది. దిగువగొట్టివీడులోనే వీరిద్దరి వివాహాన్ని మీనాక్షి కుటుంబ సభ్యులు జరిపించారు. మహేష్‌ మదనపల్లెలో టైలరింగ్‌ పని చేస్తూ జీవనం సాగించేవాడు. వివాహం కాగానే వెలిగల్లులో తల్లిదండ్రులు అద్దెకు ఉంటు న్న ఇంటికి భార్యతో కలిసి వచ్చారు. అయితే ఆషాడమాసం కావడంతో తిరిగి అత్తగారింటికి భార్యతో కలిసి వెళ్లాడు. అక్కడ నుంచి మదనపల్లెకు వెళ్లి, గురువారం తిరిగి వెలిగల్లుకు వచ్చిన మహేష్‌ చల్లావానికుంట వద్ద ఉన్న తమ పొలం దగ్గరికి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటనా స్థలాన్ని ఏఎస్‌ఐ హేమసుందరం పరిశీళించారు. మృతుని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement