మనువడు కొట్టడంతో నాయనమ్మ మృతి | Grandmother Killed By Grandson | Sakshi
Sakshi News home page

మనువడు కొట్టడంతో నాయనమ్మ మృతి

May 21 2018 12:26 PM | Updated on Aug 17 2018 2:56 PM

Grandmother Killed  By Grandson  - Sakshi

రాజక్క మృతదేహం

కాగజ్‌నగర్‌రూరల్‌ ఆదిలాబాద్‌: మనుమడు కొట్టడంతో కాగజ్‌నగర్‌ మండలంలోని అందవెల్లి గ్రామానికి చెందిన బూరం రాజక్క(90) ఆదివారం మృతి చెందింది. ఈజ్‌గాం ఎస్సై సుధాకర్‌ తెలిపిన వివరాలివీ..రాజక్క కుమారుడు ఐదు సంవత్సరాల క్రితం మృతి చెందటంతో ఆమె తన కోడలు వద్ద ఉంటోంది.

ఇటీవల మనుమడు బూరం పెంటయ్యతో గొడవ కావడంతో అనుకోకుండా కొట్టాడు. దీంతో కాలు విరిగింది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలు కూతురు ఫిర్యాదు మేరకు పెంటయ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.  

Advertisement
 
Advertisement
Advertisement