బిల్డింగ్‌పై నుంచి మహిళలను అసభ్యంగా వీడియో తీసి.. | govt employee was beaten by locals for misbehaviour | Sakshi
Sakshi News home page

Jan 30 2018 7:58 PM | Updated on Jan 30 2018 8:16 PM

govt employee was beaten by locals for misbehaviour - Sakshi

సాక్షి, కరీంనగర్‌: ఉన్నత విద్యను అభ్యసించి సర్కారు కొలువులో ఉన్న ఓ ఉద్యోగి బుద్ధి గడ్డితింది. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి.. నడిబజారులో చెప్పుదెబ్బలు తిన్నాడు. బిల్డింగ్‌పై నుంచి చూస్తూ.. బాత్‌రూమ్‌కు వెళ్ళే మహిళలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించడంతో స్థానికులు సదరు ఉద్యోగిని పట్టుకొని దేహశుద్ధి చేశారు. కరీంనగర్‌లోని జ్యోతి నగర్‌లో ఈ ఘటన జరిగింది.

ఇక్కడే నివాసం ఉండే ఓదేలు ఎస్సారెస్పీలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. తన ఇంటి చుట్టుపక్కల మహిళలను తన సెల్‌ఫోన్‌లో వీడియోలు తీస్తూ అతను అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని.. స్థానికులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ అతన్ని పట్టుకున్నారు. ఇంట్లో నుంచి అతన్ని రోడ్డుపైకి లాక్కొచ్చి మహిళలు చెప్పులతో చితక్కొట్టారు. మహిళలతోపాటు స్థానిక యువకులు సైతం ఉద్యోగిపై చితకబాదారు. మహిళల కాళ్లు మొక్కించారు.

ఉద్యోగి తల్లి అడ్డుకోగా ఆమెను సైతం స్థానికులు నెట్టేసి ఉద్యోగికి బుద్ది చెప్పారు.  మరోసారి మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే సీరియస్ గా ఉంటుందని హెచ్చరించి వదిలేశారు. బాధితుడికి పెళ్లి అయినప్పటికీ ఆయన చేష్టలతో వేగలేక భార్య దూరంగా ఉంటుందని స్థానికులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement