గౌరీ లంకేశ్‌ హత్య కేసులో ఒకరి అరెస్ట్‌ | Gauri Lankesh Murder The First Arrest Has Made | Sakshi
Sakshi News home page

గౌరీ లంకేశ్‌ హత్య కేసులో ఒకరి అరెస్ట్‌

Mar 9 2018 7:27 PM | Updated on Nov 6 2018 4:42 PM

Gauri Lankesh Murder The First Arrest Has Made - Sakshi

నవీన్‌ కుమార్‌

బెంగళూరు : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సీనియర్‌ జర్నలిస్టు గౌరీ లంకేశ్‌ హత్య కేసులో నిందితుడిగా భావిస్తున్న కేటీ నవీన్‌ కుమార్‌ అనే వ్యక్తిని శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. మాండ్యా జిల్లాకు చెందిన నవీన్‌ కుమార్‌ తన దగ్గర ఉన్నతుపాకీని అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా అనుమానం రావటంతో వారం రోజుల కిందట అతన్ని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. పలు విచారణల అనంతరం అతన్ని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

లౌకికవాదిగా, కన్నడ వార పత్రిక ‘లంకేశ్‌ పత్రికే’ ఎడిటర్‌గా ప్రసిద్ధి చెందిన గౌరీ హత్యకు గురికావడంతో అన్ని వర్గాల నుంచి నిరసనలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్‌) ఏర్పాటు చేసింది. ఈ అరెస్ట్‌తో హత్య కేసు ఒక కొలిక్కి వచ్చినట్లయిందని కర్ణాటక హోం మంత్రి రామలింగా రెడ్డి తెలిపారు. గతేడాది సెప్టెంబర్‌ 5వ తేదీ రాత్రి గుర్తు తెలియని దుండగులు సీనియర్‌ జర్నలిస్టు గౌరీ లంకేశ్‌ను ఆమె నివాసంలో కాల్చి చంపిన విషయం తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement