
బనశంకరి: గౌరీలంకేశ్ హంతకులు కర్ణాటకలో ఫైరింగ్ శిక్షణ తీసుకున్నట్లు ఎస్‌ఐటీ విచారణలో తేలింది. ఈ హత్య కేసులో 12వ ముద్దాయిగా ఉన్న భరత్ కుర్నే బెళగావి జిల్లా అటవీ ప్రాంతంలోని జామ్‌బోటి గ్రామంలోని తన సొంత పొలంలో ప్రత్యేకంగా ఫైరింగ్ రేంజి ఏర్పాటు చేసుకొని ముఖం, తలను గురిపెట్టి కాల్పులు జరపడం, నడుస్తున్న వాహనంపై కాల్పులు జరపడం, బుల్లెట్లు లోడ్ చేసిన పిస్తోల్‌ను ఎలా పట్టుకోవాలనే అంశాల్లో శిక్షణ తీసుకున్నాడు. పుణెలో సామాజికవేత్త నరేంద్ర దాబోల్కర్‌ను హత్య చేయడానికి నెలక్రితం ముందే ఫైరింగ్ శిక్షణ ప్రారంభించినట్లు విచారణలో వెలుగుచూసింది.