
ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న రాము
బాడంగి : మండలంలోని కోడూరు బీసీ కాలనీలో గ్యాస్ లీకవడంతో ఇద్దరు అన్నదమ్ములు గాయపడిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. కాలనీకి చెందిన కిలారి రాము ఇంటికి బంధువులు రానుండడంతో గ్యాస్ పొయ్యిపై వంటలు చేస్తున్నారు. ఇంతలో గ్యాస్ సిలిండర్ పైభాగం నుంచి గ్యాస్ లీకవడంతో వెంటనే సిలిండర్‌ను తప్పించే క్రమంలో పక్కనే ఉన్న కట్టెల పొయ్యి మంటలు అంటుకున్నాయి.
దీంతో రాము గాయపడగా, అతడ్ని కాపాడబోయే క్రమంలో సోదరుడు లక్ష్మనాయుడు కూడా గాయపడ్డారు. వెంటనే వీరిని 108 వాహనంలో పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించగా, తీవ్రంగా గాయపడిన రామును విజయనగరం ఆస్పత్రికి తరలించారు.