వైఎస్సార్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం | Four killed in car-lorry collision in YSR District | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Oct 4 2019 11:10 AM | Updated on Oct 4 2019 11:28 AM

Four killed in car-lorry collision in YSR District - Sakshi

సాక్షి, కడప : వైఎస్సార్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిన్నమండెం మండలం కేశాపురం వద్ద కారు, లారీ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందగా, ఒకరు గాయపడ్డారు. మృతులు హర్షవర్థన్‌, బుజ్జి, భూదేవి సంఘటనా స్థలంలోనే చనిపోయారు. కాగా గాయపడిన క్షతగాత్రుడిని రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో మరణించాడు. దీంతో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. కడపకు చెందిన వీరంతా బెంగళూరు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement