అంతుచిక్కని విదేశీ కరెన్సీ అపహరణ

Foreign Money Robbed in Western Union Money Transfer Office - Sakshi

కొనసాగుతున్న దర్యాప్తు

చోరీకి పాల్పడినవారు టర్కీ దేశస్థులుగా అనుమానం

శ్రీకాకుళం, ఇచ్ఛాపురం: పట్టణంలోని దినవారి బజారు సమీపంలోని సాయి ట్రావెల్స్‌లో నిర్వహిస్తున్న వెస్టర్న్‌ యూనియన్‌ నగదు బదిలీ కేంద్రం వద్ద సోమవారం రూ.3 లక్షల విలువైన విదేశీ కరెన్సీ చోరీకి గురైంది. ఈ  కేసు విషయమై సరైన ఆధారాలు లభించకపోవడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటివరకు పోలీసులు చేసిన దర్యాప్తులో చోరీకి పాల్పడినవారు టర్కీ దేశానికి చెందిన ఇద్దరు యువకులుగా అనుమానిస్తున్నారు. నగదు బదిలీ కేంద్రంలో పనిచేస్తున్న నిరీష ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐ సత్యనారాయణ మంగళవారం కేసు నమోదు చేశారు. అనుమాతులలో ఒకరికి సంబంధించిన ఫొటోలను సీసీ కెమెరా ద్వారా సేకరించి దర్యాప్తు కొనసాగిస్తున్నామని సీఐ ఎం.వినోద్‌బాబు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top