బుక్‌ స్టాల్లో అగ్ని ప్రమాదం  | Fire hits book stall | Sakshi
Sakshi News home page

బుక్‌ స్టాల్లో అగ్ని ప్రమాదం 

Apr 14 2018 1:19 PM | Updated on Sep 5 2018 9:47 PM

Fire hits book stall - Sakshi

దగ్ఘమైన కరెన్సీ నోట్లు

సాగర్‌నగర్‌(విశాఖ తూర్పు): ముద్ర రుణం తీసుకుని నిర్వహిస్తున్న ఓ నిరుద్యోగి బుక్‌స్టాల్‌ శుక్రవారం తెల్లవారుజామున షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా కాలిబూడదైంది. సాగర్‌నగర్‌ వుడా కాలనీ మెయిన్‌ రోడ్డులో జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. దూది రామకృష్ణ అనే నిరుద్యోగి ప్రధానమంత్రి ముద్ర యోజన ప£ýథకం కింద రూ.50 వేలు రుణం తీసుకొని ఒక బుక్‌స్టాల్‌ అండ్‌ స్టేషనరీ షాపు ఏర్పాటు చేశాడు.

గురువారం రాత్రి యథావిధిగా దుకాణం షెటర్‌ దించి తాళాలు వేసి ఇంటికి వెళ్లిపోయాడు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో విద్యుత్‌ మీటరు వద్ద షార్ట్‌ సర్క్యూట్‌ అయింది. దీంతో మంటలు చెలరేగి బుక్స్, కాగితాలకు అంటుకున్నాయి. పొగలు బయటకు రావడంతో పక్కనే ఉన్న నివాసితులు అప్రమత్తమై షాపు యజమాని రామకృష్ణకు సమాచారం అందించారు.

వెంటనే ఆయన షాపు వద్దకు వచ్చి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం తెలియజేశారు. వారు వచ్చేసరికే షాపు లోపల నోట్‌బుక్స్, విలువైన స్టేషనరీ, జిరాక్స్‌ మిషన్, రూ.11వేల నగదు కాలిబూడదైంది. గంట తర్వాత వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. చినగదిలి తహసీల్దార్‌ ఎస్‌.భాస్కరరెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆర్‌ఐ యసేశ్వని, వీఆర్‌వో సందర్శించి ఈ ప్రమాదంలో సుమారు రూ.3 లక్షలు వరకు నష్టం వాటిల్లి ఉంటుందని అంచనా వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement