గూడ్సు రైలులో అగ్నిప్రమాదం | fire accident in goods rail | Sakshi
Sakshi News home page

గూడ్సు రైలులో అగ్నిప్రమాదం

Jan 28 2018 4:55 PM | Updated on Sep 5 2018 9:47 PM

fire accident in goods rail - Sakshi

మంటలార్పుతున్న అగ్నిమాపక సిబ్బంది

గుంటూరు : తాడేపల్లి సమీపంలో గూడ్స్ రైలులో ఆదివారం అగ్నిప్రమాదం జరిగింది. అకస్మాత్తుగా బొగ్గు నుంచి మంటలు వ్యాపించటాన్ని గుర్తించిన అధికారులు గూడ్సు రైలును నిలిపి వేశారు. ఫైరింజన్‌ మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.  మంటలు చెలరేగడంతో గంటపాటు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ప్రమాద సమయంలో గూడ్సు రైలు ఒడిశా నుంచి చెన్నైకు వెళ్తోంది. అధికారులు సకాలంలో గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది.

Advertisement
 
Advertisement
Advertisement