కూతుళ్లపై తండ్రి లైంగిక దాడి

Father Sexual Assault On Daughters At Suryapet - Sakshi

సూర్యాపేట జిల్లాలో వెలుగు చూసిన దారుణం

పోలీసులకు ఫిర్యాదు చేసిన కుమార్తెలు

కోదాడ: భర్త వేధింపులు తట్టుకోలేక పుట్టింటికి చేరిన కుమార్తెని అక్కున చేర్చుకోవాల్సిన కన్నతండ్రే 6 నెలలుగా లైంగికంగా వేధించసాగాడు. ఆ బాధను తట్టుకోలేక విషయాన్ని తల్లికి చెప్పింది. దీంతో ఆమె అతడిని నిలదీయగా.. మంచిగా ఉంటానని ప్రాధేయపడటంతో వదిలేశారు. ఈ క్రమంలో మైనర్‌ అయిన చిన్న కూతురిని సైతం వేధించసాగాడు. దీంతో శనివారం పోలీసులకు ఫిర్యాదు చేయగా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కోదాడ పట్టణంలోని కట్టకొమ్ముగూడెం రోడ్డులో పెరిక హాస్టల్‌ సమీపంలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

పెద్ద కుమార్తెకు 2016లో వివాహం చేశారు. ఆమెకు రెండేళ్ల కూతురు ఉంది. భార్యభర్తల మధ్య గొడవలు రావడంతో ఆమె తల్లిగారింట్లో ఉంటోంది. తల్లి పనులకు వెళ్లిన సమయంలో తండ్రి ఆమెను లైంగికంగా వేధించసాగాడు. 6 నెలలుగా ఈ ఘాతుకానికి పాల్పడుతున్నాడు. ఈ విషయాన్ని తల్లికి చెప్పడంతో అతడిని వీరిద్దరూ నిలదీశారు. బయటకు చెప్పవద్దని అతడు ప్రాధేయపడటంతో మిన్నకుండిపోయారు. ఇక మైనర్‌ అయిన చిన్న కుమార్తెను కూడా వేధించసాగాడు. దీంతో కుమార్తెలిద్దరు స్థానిక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు ఇవ్వగా కేసు నమోదు చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top