చాక్లెట్‌ నేరం; విద్యార్థిపై డీమార్ట్‌ సిబ్బంది దాడి

DMart Security Attacked A Boy For Stolen Chocolate In Shop - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇంటర్‌ చదువుతున్న విద్యార్థి ఎల్‌. సతీష్‌(17) వనస్థలిపురంలో అనుమానాస్పదంగా మృతి చెందాడు. వనస్థలిపురంలోని డీమార్ట్‌లో షాపింగ్‌ చేయడానికి ఆదివారం తన స్నేహితులతో వెళ్లిన సతీష్‌కు సెక్యూరిటీతో గొడవ ఏర్పడింది. డీమార్టులో చాక్లెట్‌ దొంగిలించాడని విద్యార్థిపై సిబ్బంది దాడికి దిగారు. కాసేపటికి సతీష్‌ మృత్యువాత పడ్డాడు. దీంతో సెక్యూరిటీ వారు దాడి చేయడం వల్లే తన కొడుకు మరణించాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కాగా హయత్‌నగర్‌లోని శ్రీ చైతన్య జూనియర్‌ కళాశాలలో సతీష్‌ ఇంటర్‌ సెంకడ్‌ ఇయర్‌ చదువుతున్నాడు. ఈ క్రమంలో తల్లిదండ్రుల అనుమతి లేకుండానే సతీష్‌ను కళాశాల యాజమాన్యం బయటకు పంపినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top