డిప్యూటీ కలెక్టర్ మాధురి అరెస్ట్  | Deputy Collector Madhuri Arrested In Vijayawada | Sakshi
Sakshi News home page

డిప్యూటీ కలెక్టర్ మాధురి అరెస్ట్ 

Jun 3 2020 9:25 PM | Updated on Jun 3 2020 10:16 PM

Deputy Collector Madhuri Arrested In Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ : రాజధాని భూకుంభకోణం దర్యాప్తులో సీఐడీ తన దూకుడు పెంచింది. ఏపీ సీఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్ మాధురిని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అరెస్ట్ చేసింది. విజయవాడలోని తన నివాసంలో ఆమెను అదుపులోకి తీసుకొని అనంతరం రిమాండ్‌కు తరలించారు. 2016లో రాజధాని ప్రాంతంలో గోపాలకృష్ణ అనే వ్యక్తికి చెందిన భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినట్లు ఆమెపై ఆరోపణలున్నాయి. కాగా గోపాలకృష్ణను నెలరోజుల క్రితమే సిట్‌ బృందం అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం రాయపూడి డిప్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న మాధురి 3 ఎకరాల 20 సెంట్ల భూ వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆమె ప్రభుత్వానికి రూ.6 కోట్లు నష్టం కలిగించినట్టు సిట్‌ అధికారులు వివరించారు. కాగా మాధురిని సిట్ అధికారులు మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. మాధురికి న్యాయమూర్తి ఈ నెల 12 వరకు రిమాండ్ విధించారు. కాగా టీడీపీ హయాంలో మాధురి నెక్కల్, అనంతవరం,రాయకల్‌లో డిప్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వర్తించారు.

Advertisement
 
Advertisement
Advertisement