ఢిల్లీ అల్లర్లు : 35కు చేరిన మృతుల సంఖ్య

Delhi Violence : Deaths Toll Mounts - Sakshi

న్యూఢిల్లీ : దేశ రాజధానిలో హైటెన్షన్‌ కొనసాగుతోంది. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న, సమర్ధిస్తున్న వర్గాల మధ్య జరిగిన హింసాకాండలో మృతిచెందిన వారి సంఖ్య గురువారం నాటికి మరింత పెరిగింది. కొద్దిరోజుల క్రితం జరిగిన ఘర్షణల్లో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న ఏడుగురు నేడు మరణించటంతో మృతుల సంఖ్య 27 నుంచి 35కు చేరింది. ఈ హింసాకాండలో దాదాపు 250 మందికి పైగా గాయపడ్డారు. ఈ మేరకు సీనియర్‌ హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు విషయాన్ని ధ్రువీకరించారు. కాగా, రెండు రోజుల పాటు తీవ్ర ఘర్షణలతో అట్టుడికిపోయిన ఈశాన్య ఢిల్లీలో బుధవారం గొడవలు సద్దుమణిగాయి. పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉన్నప్పటికి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు. అల్లర్ల ప్రభావిత ప్రాంతాలైన చాంద్‌ భాగ్‌, భజన్‌పుర, కజురీ ఖాస్‌లలో గురువారం పారిశుద్ధ కార్యక్రమాలు మొదలయ్యాయి. ( నివురుగప్పిన నిప్పులా ఢిల్లీ )

అన్ని చోట్లా భద్రతా దళాలు మోహరించాయి. అయితే ఈ ఘర్షణల్లో బుల్లెట్‌ గాయాలు, కత్తులు, ఇతర ప్రాణాంతక ఆయుధాల కారణంగా అయిన గాయాల కన్నా.. తరుముకొస్తున్న దుండగుల బారి నుంచి తప్పించుకోవడం కోసం ఇళ్ల పై అంతస్తుల నుంచి దూకడం వల్ల చోటు చేసుకున్న గాయాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్న వైద్యులు వెల్లడించారు. ( ఎంతటి వారైనా చర్యలు తప్పవు: గంభీర్‌ )

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top