గల్లంతైన మత్స్యకారుడి మృతదేహం లభ్యం | The Dead Body Of A Fisherman Is Came Out On Thursday In Bhogapuram | Sakshi
Sakshi News home page

గల్లంతైన మత్స్యకారుడి మృతదేహం లభ్యం

May 3 2018 8:37 AM | Updated on May 3 2018 10:41 AM

The Dead Body Of A Fisherman Is Came Out On Thursday In Bhogapuram - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

విజయనగరం జిల్లా : భోగాపురం మండలం కుండ్రాజుపాలెం వద్ద సముద్రంలో గల్లంతైన మత్స్యకారుడు చిన్న అమ్మోరు మృతదేహం లభ్యం గురువారం లభ్యమైంది. గ్రామ సమీపంలోనే సముద్ర తీరానికి  గురువారం ఉదయం మృతదేహం కొట్టుకువచ్చింది. మూడు రోజుల క్రితం కుండ్రాజుపాలెం వద్ద పడవలను ఒడ్డుకు చేర్చుతుండగా చిన్న అమ్మోరు ఈదురుగాలులకు సుడిగుండంలో చిక్కుకుని గల్లంతయ్యాడు. చిన్న అమ్మోరు కోసం గ్రామస్తులు అప్పుడు వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. తాజాగా ఆయన మృతదేహం ఒడ్డుకు కొట్టుకు వచ్చింది.

Advertisement
 
Advertisement
Advertisement