హలో ఎస్‌బీఐ నుంచి మాట్లాడుతున్నా..

Cyber Crime Activities Doing By Fake Phone Calls In Peddapalli  - Sakshi

సాక్షి, పెద్దపల్లి : హలో.. సారీ నిద్రపోయారా.. 8001628694 మీకు కూడా ఇలాంటి ఫోన్‌ రావొ చ్చు.. రెండురోజుల క్రితం పెద్దపల్లికి చెందిన ఓ ఉద్యోగికి ఎస్‌బీఐ బ్రాంచి ఆఫీసు నుంచి మాట్లాడుతున్నా..మీ ఏటీఎం కార్డు టెక్నికల్‌ ప్రాబ్లం వచ్చింది వాటిని క్లియర్‌ చేస్తాం. కాస్తా మీ అకౌంట్‌ నంబర్‌ చెప్తారా..ఈ నంబర్‌ కరెక్టే కదా, మీ ఏటీఎం కార్డు మరోసారి చూసుకోండి ఇదే కదా అంటూ తెలుగులో మాట్లాడిన మోసకారి క్షణాల్లో రూ.70వేలు నొక్కేశాడు.

ఇది ఎక్కడో ఒకసారి విన్నమాటలు కాదు.. వందసార్లకు పైగా ఇలాంటి మాటలతోనే మోసాలు చేస్తున్నవారు.. మోసపోతున్నవారు ఇంకా ఉన్నారని జిల్లా కేంద్రం పెద్దపల్లిలోని ఓ ఉద్యోగి పట్ల రుజువైంది. పెద్దపల్లికి చెందిన ప్రభుత్వ ఉద్యోగిని మాటల్లో పెట్టి రూ.70వేలు నొక్కేసిన వైనంపై వారు బయటకు చెప్పుకోవడానికి కూడా ఇష్టపడడం లేదు. అచ్చమైన తెలుగులో చాలా స్పష్టంగా మాట్లాడిన యువకుడు నమ్మకం కలిగించేలా వ్యవహరించి మూడుసార్లు ఏటీఎం కార్డు ద్వారా రూ.10, 20, 40వేలు డ్రా చేశాడు.

స్థానిక ఎస్‌బీఐలో ఫిర్యాదు చేయగా ఇది తమ చేతుల్లో లేదని సైబర్‌నేరాలు పరిశోధన చేస్తున్న పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందిగా సలహా ఇచ్చారు. చివరగా స్థానిక పోలీసుస్టేషన్‌లో ఆ నంబరుపై వచ్చిన కాల్‌ ఆధారంగా దర్యాప్తు చేయాల్సిందిగా బాధితులు ఫిర్యాదు చేయడంతో పశ్చిమబెంగాల్‌ రాష్ట్రానికి చెందినదని అయినా ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. పోగొట్టుకున్న డబ్బు గురించి బాధపడడం మినహాయించి బాధితులు చేయాల్సింది ఏమి లేకుండా పోయింది.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top