అంతర్రాష్ట్ర దొంగలముఠా గుట్టురట్టు | CP Dwaraka Tirumala Rao Reveals Dacoits Case Information | Sakshi
Sakshi News home page

అంతర్రాష్ట్ర దొంగలముఠా గుట్టురట్టు

Feb 18 2020 12:29 PM | Updated on Feb 18 2020 12:32 PM

CP Dwaraka Tirumala Rao Reveals Dacoits Case Information - Sakshi

సాక్షి, కృష్ణా: జిల్లాలోని ఉయ్యూరు మండలం కాటూరులో గత మంగళవారం ఓ ఇంట్లో చొరబడి బీభత్సం చేసిన అంతర్రాష్ట్ర దొంగలముఠా గుట్టురట్టు చేసినట్లు సీపీ ద్వారాకా తిరుమలరావు తెలిపారు. వారం రోజుల వ్యవధిలో ఆ దొంగల బ్యాచ్‌లోని నలుగురిని పోలీసులు  అదుపులోకి తీసుకున్నారని ఆయన తెలిపారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు ముఠా సభ్యుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి సీపీ ద్వారాకా తిరుమల రావు మాట్లాడుతూ.. దోపిడి సమయంలో దొంగలు ఒరియా భాషలలో మాట్లాడినట్లు తెలిసిందన్నారు.

అదేవిధంగా పట్టుబడిన నిందితులు దోపిడి దొంగతనాల్లో ఆరితేరిన పెద్దింటి గొల్లలుగా పోలీసులు గుర్తించారు. గుంటూరు జిల్లా నుంచి ఏడాది క్రితం కృష్ణా జిల్లా బొడ్డుపాడుకి ఈ పెద్దింటి గొల్లలు మకాం మార్చారని తెలిపారు. అపహరించిన సొమ్మును ఆ ముఠా నుంచి పోలీసులు స్వాదీనం చేసుకున్నామని పేర్కొన్నారు. ఈ కేసును చాలెంజ్‌గా తీసుకొని రోజుల వ్యవధిలోనే చేధించిన సిబ్బందికి సీపీ ద్వారకా తిరుమలరావు అభినందనలు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement