సీఎం పర్యటన బందోబస్తు.. కానిస్టేబుల్‌ మృతి

Constable Dies Of Heart Attack While Duty At Kannepalli Pump House - Sakshi

సాక్షి, భూపాలపల్లి : రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కె.చంద్రశేఖరరావు తన తొలి అధికార పర్యటనలో భాగంగా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను సందర్శిస్తున్నారు. దానిలో భాగంగానే జయశంకర్ భూపాలపల్లిలో కేసీఆర్‌ సోమవారం పర్యటించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఓ విషాదం చోటుసుకుంది. తీవ్ర అస్వస్థతకు గురైన ఓ పోలీసు ప్రాణాలు విడిచాడు. వివరాలు.. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో కన్నెపల్లి పంప్‌హౌజ్‌ వద్ద బందోబస్తు విధులు నిర్వర్తిస్తున్న హెడ్‌ కానిస్టేబుల్‌ వజ్జ నారాయణ (ఏ ర్ హెచ్ సి 521)కు గుండెపోటు వచ్చింది. ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. విషయం తెలుసుకున్న జయశంకర్‌ జిల్లా ఎస్పీ భాస్కరన్‌ కానిస్టేబుల్‌ కుటుంబాన్ని పరామర్శించారు. (కన్నెపల్లి పంపుహౌస్‌ పనులను పరిశీలించిన కేసీఆర్‌)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top