వాట్సప్‌ కిడ్స్‌పోర్న్‌ రాకెట్‌.. 66 మంది ఇండియన్స్‌

Child Porn Rocket On Whats App - Sakshi

కిడ్స్‌పోర్న్‌ రాకెట్‌ బయటపెట్టిన సీబీఐ

సాక్షి, న్యూఢిల్లీ : వాట్సప్‌ గ్రూప్‌ పేరు ’కిడ్స్ త్రీబుల్‌ఎక్స్‌’. ఈ గ్రూప్ లో అన్ని అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలు మాత్రమే షేర్ చేసుకుంటారు. 40 దేశాలకు చెందిన వారు ఇందులో సభ్యులు. దురదృష్టకరం ఏమిటంటే ఎక్కువ మంది ఇండియా కు చెందిన వారే. 66 మంది ఇండియా వారు, 56 మంది పాకిస్తాన్‌కు చెందిన వారు, 29 మంది అమెరికాకు చెందిన వారు. ఈ గ్రూప్‌ను ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వర్మ అనే యువకుడు నిర్వహిస్తూన్నట్టు, అతడ్ని అరెస్టు చేసినట్టు సీబీఐ వెల్లడించింది. అతడి నుంచి స్వాధీనం చేసుకున్న ల్యాప్‌టాప్‌, ఫోన్‌ను తిరువనంతపురం లోని ఫోరెన్‌సిక్‌ ఎగ్జామ్‌ ఆఫ్‌ ఎలక్ర్టానిక్‌ గ్యాట్జెట్స్‌ (సీ డీఏసీ)లో పరీక్షించి నిజాలను బట్ట బయలు చేశారు.

ముంబాయికి చెందిన సత్యేంద్ర చౌహాన్‌, ఢిల్లీకు చెందిన నఫీస్‌ రాజా, జాహిద్‌, నోయిడాకు చెందిన ఆదర్శ్‌లను గ్రూప్‌ అడ్మిన్లుగా పోలీసులు గుర్తించారు. పిల్లలను ఈ గ్రూప్‌లో చేర్చుకొని పోర్న్‌ చిత్రాలు, వీడియోలు పంపడానికి వర్మ డబ్బును డిమాండ్‌ చేసి ఉంటాడని భావిస్తున్నారు పోలీసులు. అసభ్యకర చిత్రాలు, వీడియోలు ఇతరులకు పంపడం తీవ్ర నేరం అని, ఐటీ చట్టం ప్రకారం 7 సంవత్సరాల జైలు శిక్ష, 10 లక్షల వరకు జరిమాన పడే అవకాశం ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top