సెల్‌ఫోన్‌ స్నాచర్ల అరెస్ట్‌

Cell Phone Snatchers Arrest in Hyderabad - Sakshi

మియాపూర్‌: రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తినుంచి సెల్‌ఫోన్‌ లాక్కెళ్లిన కేసులో ఇద్దరు నిందితులను మియాపూర్‌ పోలీసులు అరెస్టు చేశారు. డీఐ మహేష్‌ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కూకట్‌పల్లి శేషాద్రినగర్‌కు చెందిన  కృష్ణవర్మ ఈ నెల 14న ఆల్విన్‌ ఎక్స్‌ రోడ్డు వద్ద నడిచి వెళుతుండగా వెనక నుంచి ఆటోలో వచ్చిన ఇద్దరు వ్యక్తులు అతడి సెల్‌ఫోన్‌ లాక్కుని వెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన మియాపూర్‌ పోలీసులు సీసీ కెమెరా పుటేజీ ఆధారంగా ఆటోను గుర్తించారు. 

మంగళవారం ఉదయం హఫీజ్‌పేట్‌ రైల్వే స్టేషన్‌ రోడ్డులో వాహనాల తనిఖీ చేస్తున్న పోలీసులు ఆటోను గుర్తించి అందులో ఉన్న మెహిదీపట్నం షాబేద్‌నగర్‌కు చెందిన మహ్మద్‌ ఖలీల్, అసీఫ్‌నగర్‌కు చెందిన మహబూబ్‌ ఉస్మాన్‌లను అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించారు. వారి నుంచి సెల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని అరెస్ట్‌ చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top