సుజనా ఫోరమ్‌ మాల్‌పై చీటింగ్‌ కేసు | Case of cheating filed against Kukatpally's Forum Sujana Mall | Sakshi
Sakshi News home page

సుజనా ఫోరమ్‌ మాల్‌పై కేసు నమోదు

Oct 4 2017 3:05 PM | Updated on Sep 2 2018 5:11 PM

Case of cheating filed against Kukatpally's Forum Sujana Mall - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కూకట్‌పల్లిలోని సుజనా ఫోరమ్‌ మాల్‌పై పోలీసులు బుధవారం చీటింగ్‌  కేసు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్‌ ఫీజు వసూలు చేస్తున్నారంటూ నగరానికి చెందిన విజయ్‌ గోపాల్‌ అనే వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు 188,418, 420 సెక్షల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా సుజనా ఫోరమ్‌ మాల్‌ ....కేంద్రమంత్రి సుజనా చౌదరికి చెందినది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement