భార్యాభర్తను బలిగొన్న కారు | Car Accident In Nalgonda | Sakshi
Sakshi News home page

భార్యాభర్తను బలిగొన్న కారు

Sep 13 2018 10:12 AM | Updated on Sep 13 2018 10:12 AM

Car Accident In Nalgonda - Sakshi

మృతులు, యాదమ్మ ,బాలయ్య

చౌటుప్పల్‌(మునుగోడు) : అతివేగంతో ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కన కల్లు అమ్ముకుని జీవిస్తున్న భార్యాభర్తపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే భార్య .. చికిత్స పొందుతూ భర్త మృతిచెందాడు. ఈ ఘటన బుధవారం చౌటుప్పల్‌ మండలం గుండ్లబావి గ్రామ శివారులో జీఎమ్మార్‌ టోల్‌ప్లాజా సమీపంలో 65వ నంబర్‌ జాతీయ రహదారిపై జరిగింది. పో లీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుండ్లబావి గ్రామానికి చెందిన చీకూరి బాలయ్య(62), ఆయ న భార్య యాదమ్మ(55)లు గీత వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అందులో భాగంగా గ్రామ శివారులో జాతీయ రహదారి వెంట గుడిసె ఏర్పాటు చేసుకుని కల్లు విక్రయిస్తుంటారు. ఉదయం ఇద్దరు కలిసి గుడిసె వద్దకు వెళ్లారు. కల్లు కొనుగోలుదారుల కోసం రహదారిపై నిల్చున్నారు.

ఇదే సమయంలో విజయవాడ నుంచి హైదరాబాద్‌కు అజాగ్రత్త, అతివేగంగా వెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపు తప్పింది. కారును ని యంత్రించడంలో విఫలమైన డ్రైవర్‌ శీలం కృష్ణారావు రోడ్డు పక్కన నిల్చున్న భార్యాభర్తపైకి దూసుకెళ్లాడు. ఈ ప్రమాదంలో యాదమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. కొన ఊపిరితో ఉన్న బాలయ్యను చౌటుప్పల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించంతో అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతదేహాలకు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఎస్‌ఐ నవీన్‌బాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు. భార్యభర్త ఇద్దరూ ఒకేసారి మరణించడంలో గుండ్లబావి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement