మరుభూమిగా గ్రామాలు

Bus Accident Death List - Sakshi

కంటి‘పాపలు’ కన్నుమూశారు

హిమ్మత్‌రావుపేటకు చెందిన వేములభాగ్య వ్వ (45) తన కూతురు శైలజ, మనవడు అరుణ్‌సాయి(4)తో కలిసి జగిత్యాలలోని అసుపత్రికి బయల్దేరింది. ప్రమాదంలో భాగ్యవ్వ చనిపోయింది. అరుణ్‌సాయి సంఘటనాస్థలంలోనే చనిపోయారు. శైలజకు కాళ్లు, నడుము విరిగాయి. రాంసాగర్‌కు చెందిన బైరి రితన్య(4)కు ఆరోగ్యం బాగాలేకపోవడంతో తల్లికీర్తన ఏడాది వయసున్న కొడుకు శివతోకలిసి జగిత్యాలకు బయల్దేరారు. ప్రమాదంలో రిత న్య మృతిచెందింది. తల్లి కీర్తనకు నడుము, కాళ్ల కు తీవ్రగాయాలయ్యాయి. శనివారంపేటకు చెందిన ఎండ్రిక్కాయలలత కూతురు నందిని(1), గాజుల శ్రీహర్ష(2) కూడా ప్రమాదంలో చనిపోయారు. తీవ్రగాయాలతో ఆసుపత్రిపాలైన మాతృమూర్తు లు శైలజ, కీర్తనలు కడచూపుకు నోచుకోలేని పరిస్థితి. కంటిపాపలు దూరమవడంతో రోదనలు మిన్నంటాయి.

కొడిమ్యాల(చొప్పదండి): కొండగట్టు ఘాట్‌రోడ్డులో జరిగిన ఘోరరోడ్డు ప్రమాదం కొడిమ్యాల మండలంలో విషాదాన్ని నింపింది. మండలంలోని హిమ్మత్‌రావుపేట, డబ్బుతిమ్మయ్యపల్లి, రాంసాగర్, శనివారంపేట, తిర్మలాపూర్‌ గ్రామాలు మరుభూములుగా మారాయి. ఏడాదివయ సున్న చిన్నారి నుంచి ప్రారంభిస్తే డిగ్రీచదివే విద్యార్థులు, ప్రసూతికి వెలుతున్న గర్భిణులు, వృద్ధదంపతులు, కుటుంబాలకు పెద్దదిక్కైనవారు అందరాని లోకాలకు వెళ్లారు. 31 మంది మహిళలు, ఇద్దరు చిన్నారులు, 16 మంది పురుషులు మృతిచెందినవారిలో ఉన్నారు.

శనివారంపేట గ్రామంలో..
మండలంలోని శనివారంపేటకు చెందిన 13 మంది మృతిచెందారు. నామాల మౌనిక (24), గోలి అమ్మాయి(44), ఎండ్రికాయల ఎంకమ్మ(55), ఉత్తం భూలక్ష్మి(45), ఉత్తం సుమలత(25) ఉత్తం నందన (1), బొల్లారపు బాబు(54), సలేంద్ర వరలక్ష్మి(28), కుంబాల సునంద(45), గుడిసె రాజవ్వ(50), షేర్ల గంగయ్య(75), అల్లెరమ(22), గోలి రాజమల్లు(50) మృతిచెందారు.

తిర్మలాపూర్‌లో..
తిర్మలాపూర్‌ గ్రామపంచాయతీ పరిధిలో శ్యామకూర మల్లవ్వ(35), తిప్పర్తి రత్నవ్వ(65), దాసరి సుశీల(65), తైదల పుష్ప(40), సోమిడి పుష్ప(40)తోపాటు, అనుబంధ గ్రామమైన సంద్రాలపల్లిలో కంకణాలఎల్లవ్వ(70) చనిపోయారు.

హిమ్మత్‌రావుపేటలో..
గ్రామానికి చెందిన లంబ కోటయ్య(55), పోలు లక్ష్మి(35), మల్యాల అనిల్‌(19), గండి లక్ష్మి(55), వేముల భాగ్యవ్వ(45), వేముల అరుణ్‌సాయి (4), పందిరి సత్తవ్వ(70), నేదూరి మధునవ్వ (69), పడిగెల స్నేహలత(18) లోకాన్ని విడిచారు.

డబ్బుతిమ్మయ్యపల్లిలో..  
గ్రామానికి చెందిన వొడ్నాల కాశీరాం(60), వొడ్నాల లసుమవ్వ(55), గోల్కొండ దేవయ్య(60), గొల్కొండ లక్ష్మి(55), పిడుగు రాజిరెడ్డి(55), గాజుల చిన్నయ్య(55), గాజుల రాజవ్వ(58), లైసెట్టి కళ(35), డబ్బు అమ్మాయి(55), పూండ్ర లలిత(35) మృతి చెందిన వారిలో ఉన్నారు.

రాంసాగర్‌లో..
రాంసాగర్‌గ్రామానికి చెందిన  డ్యాగల ఆనందం(60), డ్యాగల స్వామి(35), షేర్ల హేమ(30), షేర్ల మౌనిక(21), తిరుమణి ముత్తయ్య(65), మెడిచెల్మల గౌరమ్మ(45), మెడిచెల్మల రాజేశం(60), బైరి రితన్య(4) చనిపోయారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top