
భార్యను వదిలేసిన కుమారుడ్ని..
ఖగారియా (బిహార్) : కుటుంబ వివాదం నేపథ్యంలో కన్నకొడుకుని చంపిన ఓ జంటను బిహర్‌లోని ఖగారియా జిల్లాలో పోలీసులు అరెస్ట్ చేశారు. గొగ్రి సబ్‌డివిజన్‌లోని మహేష్‌కుంట్ గ్రామలో 28 ఏళ్ల అరవింద్ కుమార్ చురాసియాను కుటుంబ వివాదం నేపథ్యంలో తల్లితండ్రులే తీవ్రంగా కొట్టడంతో మరణించిన ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు.
భార్యను వదిలేసిన చురాసియా ఇదే విషయమై తరచూ ఇంట్లో గొడవ పడుతుండేవాడని, అతనికి వివాహేతర సంబంధం కూడా ఉన్నట్టు సబ్ డివిజినల్ పోలీస్ అధికారి పీకే ఝా పేర్కొన్నారు. సోమవారం సైతం భార్యతో విభేదాల విషయమై తల్లితండ్రులతో గొడవపడటంతో చురాసియాను తల్లితండ్రులు తీవ్రంగా కొట్టారని సబ్ డివిజజనల్ అధికారి పీకే ఝా తెలిపారు. మహేష్‌కుంట్ పోలీస్ స్టేసన్‌లో ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసిన పోలీసులు విచారణను చేపట్టారు.