అనుమానాస్పదస్థితిలో బ్యూటీషియన్‌ మృతి | Beautician Suspicious death In Karnataka | Sakshi
Sakshi News home page

అనుమానాస్పదస్థితిలో బ్యూటీషియన్‌ మృతి

Jun 27 2018 8:27 AM | Updated on Jun 27 2018 8:27 AM

Beautician Suspicious death In Karnataka - Sakshi

రమ్య(ఫైల్‌)

మైసూరు: ఒంటరిగా నివసిస్తున్న బ్యుటీషియన్‌ అనునాస్పదస్థితిలో మృతి చెందిన ఘటన మంగళవారం నగరంలోని దామోదర లేఅవుట్‌లో చోటు చేసుకుంది. చెన్నారయపట్టణ తా లూలకా జన్నివార గ్రామానికి చెందిన రమ్య(25)కు ఆరు సంవత్సరాల క్రితం మైసూరు నగరానికి చెందిన ఆనంద్‌ అనే వ్యక్తితో వివాహమైంది.

రెండేళ్ల క్రితం భర్తతో విబేధాలు రావడంతో ఆయనకు దూరంగా ఉంటూ నగరంలోని ఓ ప్రముఖ ప్రైవేటు హోటల్‌లో బ్యుటీషియన్‌గా పని చేస్తూ దామోదర లేఅవుట్‌లో ఉండేవారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఎంతకీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన తల్లితండ్రులు గదిలోకి వెళ్లి చూడగా రమ్య ఉరి వేసుకున్న స్థితిలో విగతజీవిగా ఉండడాన్ని గమనించిఆలనహళ్లి  పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement