అంధ మహిళపై బ్యాంకు మేనేజర్‌ అఘాయిత్యం! | Bank Manager Molested Visually Challenged In Bhopal | Sakshi
Sakshi News home page

అంధ మహిళపై బ్యాంకు మేనేజర్‌ అఘాయిత్యం!

Apr 18 2020 11:19 AM | Updated on Apr 18 2020 11:38 AM

Bank Manager Molested Visually Challenged In Bhopal - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

భర్త లాక్‌డౌన్‌తో  రాజస్తాన్‌లో చిక్కుకుపోవడంతో ఆమె ఫ్లాట్‌లో ఒంటరిగా ఉంటోంది

భోపాల్‌: కరోనా లాక్‌డౌన్‌తో జనజీవనం స్తంభించిన వేళ మధ్యప్రదేశ్‌లో ఓ బ్యాంకు మేనేజర్‌ (53) అంధ మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. భర్త లాక్‌డౌన్‌తో రాజస్తాన్‌లో చిక్కుకుపోవడంతో ఆమె ఫ్లాట్‌లో ఒంటరిగా ఉంటోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వరంగ బ్యాంకులో మేనేజర్‌గా పనిచేస్తున్న ఉద్యోగి సదరు మహిళపై అత్యాచారం చేశాడు. ఈ ఘటన రాష్ట్ర రాజధాని భోపాల్‌ నగరంలోని షాపుర ప్రాంతంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలాఉండగా.. రాష్ట్రవ్యాప్తంగా 1310 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 69 మంది కోలుకున్నారు. 69 మరణాలు సంభవించాయి.
(చదవండి: కరోనా.. మధ్యప్రదేశ్‌లో 35 మంది డిశ్చార్జ్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement