న్యాయవాది కుమారుడి కిడ్నాప్‌నకు యత్నం | Attempt to kidnap the lawyer's son | Sakshi
Sakshi News home page

న్యాయవాది కుమారుడి కిడ్నాప్‌నకు యత్నం

Apr 4 2018 2:58 AM | Updated on Apr 4 2018 2:58 AM

Attempt to kidnap the lawyer's son - Sakshi

కాజీపేట రూరల్‌: హైకోర్టు న్యాయవాది కుమారుడిని ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్‌కు యత్నించారు. సికింద్రాబాద్‌లోని ఇందిరానగర్‌ వారసిగూడకు చెందిన హైకోర్టు న్యాయవాది ఎన్‌.నర్సింహారావు ఇంటికి సోమవారం రాత్రి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వెళ్లి అతడి కుమారుడు సాయి మనోహర్‌ (12)ను కిడ్నాప్‌ చేసి మారుతికారులో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ముందు సెంటర్‌ వరకు తీసుకొచ్చారు. 

అప్పటికే బాలుడు ఏడుస్తుండగా హోటల్‌కు వెళ్లి ఏమైనా తీసుకొస్తామని ఒకరు లోపలికి వెళ్లగా మరొకరు బయట ఉన్నారు. కాగా, తనను కిడ్నాప్‌ చేస్తున్నట్లుగా గుర్తించిన మనోహర్‌ వారి నుంచి తప్పించుకుని సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ లోపలికి పరుగెత్తుకొచ్చాడు. రాత్రి 11.30 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి గూడూరుకు వెళ్తున్న సింహపురి ఎక్స్‌ప్రెస్‌ను ఎక్కాడు.

దీంతో రైలులో ఉన్న ఎస్కార్ట్‌ పోలీసులు గమనించి కోపగించగా బాలుడు జరిగిన విషయం వారికి తెలిపాడు. కాగా, అర్ధరాత్రి 1.30 గంటలకు రైలు కాజీపేట జంక్షన్‌కు చేరుకోగా ప్లాట్‌ఫాంపై పెట్రోలింగ్‌ చేస్తున్న ఏఎస్‌ఐ రాజిరెడ్డికి బాలు డిని ఎస్కార్ట్‌ పోలీసులు అప్పగించగా.. వారు తల్లిదండ్రులకు అప్పగించారు. 

Advertisement
 
Advertisement
Advertisement