ఘర్షణను అడ్డుకున్నాడని..

Attack Case Man Died In Nalgonda - Sakshi

మునగాల(నల్గొండ) :  ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్న ఘర్షణను అడ్డుకోవడానికి ప్రయత్నిం చిన ఓ వ్యక్తిపై నిందితులు దాడి చేసి తీవ్రంగా పరిచారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాధితుడు మృతిచెందాడు. ఈ సంఘటన ఆదివారం రాత్రి మునగాల మండలం బరాఖత్‌గూడెంలో జరిగింది. మృతుడి కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బరాఖత్‌గూడెం గ్రా మానికి చెందిన షేక్‌ బంటుసాహెబ్‌(45) వృతి ్తరీత్యా వ్యవసాయ కూలీ. ఇతనికి ఇద్దరు సోదరులు ఉన్నారు. రెండో అన్న షేక్‌ దస్తగిరి పెద్ద కుమారుడు షేక్‌ షరీఫ్, పెద్ద అన్న షేక్‌ మన్సూర్‌ అలీతో ఆదివారం రాత్రి ఓ విషయంలో ఘర్షణకు ది గాడు. షరీఫ్‌ సాయంత్రం 7గంటల సమయంలో మన్సూర్‌ అలీ ఇంటివద్దకు వచ్చి ఘర్షణ పడుతుండగా అటుగా వస్తున్న బంటు సాహెబ్‌ ఘర్షణ వద్దని షరీఫ్‌ను అడ్డుకోబోయాడు. దీంతో ఆగ్రహించిన షరీఫ్‌ బంటు సాహెబ్‌పై దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు.

దీంతో గాయపడిన బం టు సాహెబ్‌ ఇంటికి చేరుకుని జరిగిన విషయాన్ని భార్య జాన్‌బీ, కూతురు, అల్లుడికి వివరిస్తుండగా పక్కఇంటిలో ఉన్న షరీఫ్‌ తండ్రి దస్తగిరి, సోదరుడు మీరా మరోసారి బంటుసాహెబ్‌పై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. దీంతో తీవ్ర గాయాలపాలైన బంటు సాహెబ్‌ను కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం కోదాడకు తరలించగా చికిత్స పొం దు తూ మృతిచెందాడు. విషయం తెలుసుకున్న కో దాడ డీఎస్పీ బి.సుదర్శన్‌రెడ్డి, స్థానిక సీఐ ఎస్‌.శివశంకర్‌ గౌడ్‌ సంఘటన స్థలానికి చేరుకుని ఘర్ష ణకు దారితీసిన విషయాలను స్థానికులు, కుటుం బసభ్యులను అడిగి తెలుసుకున్నారు.మృతుని భా ర్య జానిబీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులు షేక్‌ షకీర్, షేక్‌ దస్తగరి, షేక్‌ మీరాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మునగాల ఎస్‌ఐ గడ్డం నగేష్‌ తెలిపారు. బంటు సాహెబ్‌ మృతదేహానికి కోదాడ ప్రభుత్వ ఆస్పత్రిలో శవపరీక్ష నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించినట్లు సీఐ శివశంకర్‌ గౌడ్‌ తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top