పరిగి పోలీస్‌స్టేషన్‌లో దారుణం | Atrocity In Parigi Police Station | Sakshi
Sakshi News home page

పరిగి పోలీస్‌స్టేషన్‌లో దారుణం

May 4 2018 9:31 AM | Updated on Aug 21 2018 9:20 PM

Atrocity In Parigi Police Station - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

వికారాబాద్ జిల్లా : పరిగి పోలిస్ స్టేషన్‌లో దారుణం  జరిగింది. ఓ కేసు విషయంలో రాజు అనే యువకుడిని స్థానిక ఎస్సై ఓబుల్ రెడ్డి చితకబాదారు. ఎస్సై దెబ్బలు తాళలేక రాజు స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో పోలీసులు హుటాహుటిన 108 వాహనంలో రాజును ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పోలీసుల దెబ్బలు తాళలేకే స్పృహ కోల్పోయాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. మీడియాకు తెలిస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హూటాహుటిన బాధితుడిని పోలీసులు ఇంటికి పంపించేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement