రెండో పెళ్లి కేసులో ఆర్మీ ఉద్యోగి.. | Army Employee Remand in Second marriage Case | Sakshi
Sakshi News home page

రెండో పెళ్లి కేసులో ఆర్మీ ఉద్యోగి రిమాండ్‌

Sep 28 2019 9:29 AM | Updated on Sep 28 2019 9:29 AM

Army Employee Remand in Second marriage Case - Sakshi

రమేష్‌ (ఫైల్‌)

జవహర్‌నగర్‌: ఓ యువతిని మోసం చేసి రెండో పెళ్లి  చేసుకున్న ఆర్మీ ఉద్యోగిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించిన సంఘటన జవహర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. సీఐ భిక్షపతిరావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. స్థానిక మదర్‌ థెరిస్సా కాలనీకి చెందిన సుర్భమ్‌ రమేష్‌ ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతడికి భార్య, ఏడేళ్ల కుమార్తె ఉన్నారు. ఈ విషయాన్ని దాచిపెట్టిన అతను తనను రెండో పెళ్లి చేసుకుని మోసం చేశాడని ఓ యువతి జవహర్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం నిందితుడు రమేష్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement