అంజలి శవమై బయటకు వచ్చింది! | anjali found death in sagar canal | Sakshi
Sakshi News home page

అంజలి శవమై బయటకు వచ్చింది!

Feb 24 2018 6:34 AM | Updated on Feb 24 2018 6:34 AM

anjali found death in sagar canal - Sakshi

మృతదేహంతో బయటకు వస్తున్న స్థానికులు , అంజలి మృతదేహం

ఒంగోలు, మార్టూరు: ప్రమాదవశాత్తు సాగర్‌ కాలువలో గల్లంతైన అంజలి మృతదేహాన్ని శుక్రవారం స్థానికులు, ఈతగాళ్ల సాయంతో పోలీసులు వెలికి తీశారు. వలపర్ల గ్రామానికి చెందిన పల్లపు అంజలి (13) గురువారం ప్రమాదవశాత్తు సాగరు కాలువలో గల్లంతైన సంగతి తెలసిందే. ఎస్‌ఐ చిరుమామిళ్ల వెంకటేశ్వర్లు రామకూరు లాకుల వద్ద ఏర్పాటు చేసిన వల సమీపంలో అంజలి మృతదేహం లభ్యమైంది. అంజలి తండ్రి అనారోగ్యంతో బాధపడుతుండగా తల్లి కూలీ నాలీ చేసుకుంటూ ముగ్గురు ఆడపిల్లలను, భర్తను పోషించుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ సంఘటన జరగడంతో వలపర్ల బీసీ కాలనీలో చూపరులను కలచి వేసింది. చిలుకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి అంజలి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement