ఉదిత్‌ నారాయణ్‌ కుమారుడి అరెస్ట్‌ | Aditya Narayan Was Arrested For Hitting Auto Rickshaw | Sakshi
Sakshi News home page

ఉదిత్‌ నారాయణ్‌ కుమారుడి అరెస్ట్‌

Mar 13 2018 8:50 AM | Updated on Apr 3 2019 8:03 PM

Aditya Narayan - Sakshi

ఆదిత్య నారాయణ్‌ కారు, ప్రమాదానికి గురైన ఆటో

సాక్షి, ముంబై : బాలీవుడ్‌ ప్రముఖ గాయకుడు ఉదిత్‌ నారాయణ్‌ కుమారుడిని ముంబై పోలీసులు సోమవారం రాత్రి అరెస్ట్‌ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే... ఆదిత్య నారాయణ్‌ తన కారుతో ఓ ఆటోను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌, అందులోని మహిళా ప్రయాణీకురాలు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారు ఆదిత్య నారాయణ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సెక్షన్‌ 338, 279 కింద అతడిపై కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు. ఆదిత్య నారాయణ్‌ గాయకుడిగానే కాకుండా వ్యాఖ్యాతగా, నటునిగా కూడా రాణిస్తున్నాడు. అతడు పలు టీవీ కార్యాక్రమాల ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితుడు.

Advertisement
 
Advertisement
Advertisement