భర్త చేతిలో నటి దారుణహత్య | Actress And Singer Reshma Shot Dead By Her Husband | Sakshi
Sakshi News home page

Aug 9 2018 9:16 AM | Updated on Aug 21 2018 3:16 PM

Actress And Singer Reshma Shot Dead By Her Husband - Sakshi

వెంటాడి మరీ  తన భార్యను కడతేర్చాడు ఓ ప్రబుద్ధుడు.

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌లో మహిళా ఆర్టిస్టులపై దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో మరో నటి-సింగర్‌ భర్త చేతిలో దారుణహత్యకు గురయ్యారు. ఈ దారుణం పాక్‌లోని ఖైబర్‌ ఫంక్తుఖ్వాలో చోటుచేసుకుంది.

నటి రేష్మ పలు సినిమాల్లో నటించారు. గాయనిగానూ ఆమెకు మంచి పేరుంది. భర్తతో విభేదాలు ఉండటంతో రేష్మ గత కొన్నిరోజులుగా నౌషెరా కలాన్‌ లోని హకిమాబాద్‌లోని తన సోదరుడి ఇంట్లో ఉంటున్నారు. ఈ క్రమంలో ప్లాన్‌ ప్రకారం అక్కడికి వచ్చిన రేష్మ భర్త ఆమెపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. తూటాలకు ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోగా, నిందితుడు అక్కడినుండి పరారయ్యాడు. అనంతరం నటి రేష్మ తీవ్ర రక్తస్రావంతో మృతిచెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. భర్తకు రేష్మ నాలుగో భార్య కాగా, వీరి మధ్య మనస్పర్థలున్నాయని పోలీసులు తెలిపారు.

కాగా, రేష్మ హత్య ఈ ఏడాది మహిళా ఆర్టిస్టులపై జరిగిన 15వ ఉదంతం(దాడి) కావడం గమనార్హం. ఈ ఏడాది ఫిబ్రవరి 3న ఆర్టిస్ట్‌ సంబల్‌ ఓ ప్రైవేట్‌ పార్టీలో హత్యకు గురైన విషయం విదితమే.

Advertisement
 
Advertisement
Advertisement