ఘోర బస్సు ప్రమాదం; ఆరుగురు మృతి | 6 Died, 43 Injured after Bus Falls Into Gorge in Jharkhand | Sakshi
Sakshi News home page

జార్ఖండ్‌లో బస్సు ప్రమాదం..ఆరుగురు మృతి

Jun 25 2019 12:56 PM | Updated on Jun 25 2019 1:31 PM

6 Died, 43 Injured after Bus Falls Into Gorge in Jharkhand - Sakshi

రాంచి : చత్తీస్‌ఘఢ్‌లోని అంబికాపూర్‌ నుంచి జార్ఖండ్‌ వస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. జార్ఖండ్‌లోని గర్హ్వా జిల్లా సమీపంలో అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటన మంగళవారం తెల్లవారు జామున 3.30 గంటల ప్రాంతంలో జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, 43 మంది గాయాలపాలయ్యారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన సీఆర్‌పీఎఫ్‌ బృందాలు మృతదేహాలను వెలికితీసి, గాయాలపాలైన వారిని బస్సులోని కిటికీల ద్వారా ప్రవేశించి రక్షించారు. క్షతగాత్రుల్లో ముగ్గురిని రాజేంద్ర ఇన్స్టిట్యూట్‌ మెడికల్‌ సైన్స్‌కు, మిగతా వారిని స్థానిక హస్పిటల్‌కు తరలించారు. ఇదిలా ఉండగా సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని ఎస్పీ శివానీ తివారీ తెలిపారు.

కాగా ఇటీవలే జార్ఖండ్‌లో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. జూన్ 10 న హజారిబాగ్ జిల్లాలోని చౌపరన్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో పట్నాకు బయలుదేరిన బస్సు ఇనుముతో ఉన్న ట్రక్కును ఢీ కొట్టిన ఘటనలో 11 మంది మరణించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement