ఐదేళ్ల చిన్నారిపై లైంగికదాడి

5 Years Girl Molested By Neighbour In Polavaram - Sakshi

సాక్షి, పోలవరం రూరల్‌ : పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలంలోని గాజుల గొంది గ్రామంలో ఐదేళ్ల బాలికపై లైంగికదాడి జరిగింది. అదే గ్రామానికి చెందిన యువకుడు నేరం శేఖర్‌ బాలికకు మాయమాటలు చెప్పి అకృత్యానికి పాల్పడ్డాడు. బాలిక తల్లి, పోలీసుల కథనం ప్రకారం.. గాజులగొందిలో ఆదివారం బాలిక ఆడుకుంటుండగా నేరం శేఖర్‌ బాలికకు లడ్డూలు ఇచ్చి మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక ఏడుస్తూ వస్తుండగా తల్లి, చుట్టుపక్కలవారు ఎందుకు ఏమైందని ప్రశ్నించారు. చిన్నారి చెప్పక పోవడంతో లడ్డూ ఎక్కడిది, ఎవరిచ్చారని బాలికను అడగ్గా, శేఖర్‌ మావయ్య ఇచ్చాడని చెప్పింది. 

బాలికను పరిశీలించగా కాళ్ల వద్ద రక్తం కారడాన్ని గుర్తించారు. దీంతో తల్లిదండ్రులు, గ్రామస్తులకు అనుమానం వచ్చి చిన్నారిని హుటాహుటిన పోలవరం ప్రభుత్వ వైద్యశాలకు తీసుకొచ్చారు. డాక్టర్లు జి.సుధాకర్, అక్కమాంబలు చిన్నారికి వైద్యపరీక్షలు నిర్వహించి లైంగిక దాడికి గురైనట్లు వెల్లడించారు. ఆస్పత్రికి డీఎస్పీ ఏటీవీ రవికుమార్, పోలవరం సీఐ ఎం.రమేష్‌బాబు, ఎస్సై కె.శ్రీహరిరావు చేరుకుని బాలికను పరిశీలించి వైద్యాధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. కాగా, బాలికను మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి తరలించారు. నిందితుడిపై కేసు నమోదు చేశారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top