
టెక్సాస్ : అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. టెక్సాస్‌లోని వాల్‌మార్ట్ స్టోర్‌లో కొంతమంది దుండగులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో 20 మంది మృతి చెందగా, మరో 26మంది తీవ్రంగా గాయపడ్డారు. ఏడు రోజుల వ్యవధిలో వాల్‌మర్ట్ స్టోర్‌లో కాల్పులు జరగడం ఇది రెండోసారి. కాల్పులు జరిపిన దుండగుల్లో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.