కంటైనర్‌ను ఢీకొన్న డీసీఎం: 14 ఆవులు మృతి | 14 cows death in accident | Sakshi
Sakshi News home page

Dec 9 2017 10:41 AM | Updated on Apr 3 2019 7:53 PM

పెద్దమందడి: వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని వెల్టూరు సబ్‌ స్టేషన్ సమీపంలో 44వ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న కంటైనర్‌ను డీసీఎం ఢీకొనడంతో అందులో ఉన్న 14 ఆవులు మృతిచెందాయి. డీసీఎం డ్రైవర్ అంజి, పశువుల వ్యాపారి బాబుకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కర్నూలు ఆసుపత్రికి తరలించారు. అనంతపురం నుంచి షాద్‌నగర్‌కు ఈ పశువులను తీసుకెళ్తున్నారు. డీసీఎం డ్రైవర్‌ కునుకు తీయడం వల్లే ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. చనిపోయిన పశువుల విలువ దాదాపు రూ.5 లక్షలు ఉండవచ్ఛని ఎస్ఐ లెనిన్ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement