ఈ బుల్లి ఫోన్‌ ప్రత్యేకతలు వింటే..

Zanco Tiny T1  the Smallest Mobile Phonei  inthe world - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : 'ప్రపంచంలో అతిచిన్న మొబైల్ ఫోన్'  ను  యుకేకి చెందిన జాంకో  లాంచ్‌ చేసింది.  ‘జాంకో టైనీ టీ1’  పేరుతో ప్రారంభించిన  ఈ ఫోన్ ఎంత చిన్నదంటే కేవలం మనిషి బొటన వేలంత పొడవు మాత్రమే ఉంటుంది.  అంతేకాదు ఒక కాయిన్‌ కంటే తక్కువ బరువు వుంటుంది. కేవలం 13 గ్రాములు.  ఇందులో  సింగిల్ నానో సిమ్ వేసుకోవచ్చు.  ఫోన్‌ బుక్‌లో 300 కాంటాక్ట్స్, 50 మెసేజ్‌లను,  50 కాల్‌లాగ్స్‌ను మాత్రమే స్టోర్‌ చేసుకునే సదుపాయం. ఇంటర్నెట్ యాక్సెస్ లేని ఈ ఫోన్ ప్రపంచంలోని అన్ని దేశాల్లో 2018, మే నెలలో మార్కెట్‌లోకి రానుంది. ఇక రేటు విషయానికొస్తే  సుమారు రూ.2,500. ఇంత ప్రత్యేకమైన ఫోన్‌లో బ్లూటూత్, మైక్రో యూఎస్‌బీ, లౌడ్ స్పీకర్లు ఫీచర్లు  సహా ఇతర ఫీచర్లు  కూడా చాలా ప్రత్యేకమైనవే అని చెప్పాలి.  అయితే భారీ స్క్రీన్లు, అద్భుతమైన కెమెరాలతో దూసుకుపోతున్న స్మార్ట్‌ఫోన్‌ సెగ్మెంట్‌లో ఈ బుల్లిఫోన్‌  యూత్‌ను ఏ  మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి!

టైనీ టీ 1 ఫీచర్స్..
0.49 ఇంచ్ ఓలెడ్ డిస్‌ప్లే
32 x 64 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్‌
మీడియాటెక్ ఎంటీకే 6261డి మదర్‌బోర్డు
2జీ
32 ఎంబీ స్టోరేజ్‌
200 ఎంఏహెచ్ కెపాసిటీ బ్యాటరీ, 3 రోజులు స్టాండ్‌బై, 180 నిమిషాల టాక్‌ టైం
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top