లెనోవో మూడు స్మార్ట్‌ఫోన్లు: జెడ్ 6 ప్రొ ఫీచర్లు అదుర్స్!

 Z6 Pro K10 Note A6 Note Smartphones Launched in India  by  Lenovo - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : చైనా స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ లెనోవో మూడు కొత్త స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేసింది. లెనోవో జెడ్‌ 6 ప్రొ,  లెనోవో కే 10 నోట్‌, లెనోవో ఏ6 నోట్‌ పేర్లతో వీటిని భారత మార్కెట్లో తీసుకొచ్చింది. ప్రధానంగా ప్రీమియం మోడల్‌  జెడ్‌ 6 ప్రొ లో 6.39 ఇంచుల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను, 12 జీబీ ర్యామ్‌, వెనుక భాగంలో 48 మెగాపిక్సల్ భారీ కెపాసిటీతో పాటు, నాలుగు కెమెరాలను, 27 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్‌ను అమర్చింది.

లెనోవో జడ్ 6 ప్రొ ఫీచర్లు
6.39 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్, 
ఆండ్రాయిడ్ 9.0పై, 
12 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్
48+16+ 8+ 2 ఎంపీ రియర్‌ క్వాడ్‌ కెమెరా
32 ఎంపీ  సెల్ఫీ  కెమెరా
4000 ఎంఏహెచ్ బ్యాటరీ,
ఫాస్ట్ చార్జింగ్, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్
ధర రూ. 33,999

లెనోవో  కే 10 నోట్‌  ఫీచర్లు
 6.30 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే
క్వాల్కం స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్, 
ఆండ్రాయిడ్ 9.0పై, 
4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్
16+ 8+5 ఎంపీ రియర్‌ ట్రిపుల్‌ కెమెరా
16 ఎంపీ సెల్ఫీ  కెమెరా
4050 ఎంఏహెచ్ బ్యాటరీ,
ఫాస్ట్ చార్జింగ్, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్
ధర రూ.13,999

లెనోవో ఏ 6 నోట్‌ ఫీచర్లు
6.09 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
మీడియా టెక్‌ హీలియో పీ 22 ప్రాసెసర్, 
ఆండ్రాయిడ్ 
3 జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్
13+2 ఎంపీ రియర్‌ డ్యుయల్‌ కెమెరా
5 ఎంపీ  సెల్ఫీ  కెమెరా
4000 ఎంఏహెచ్ బ్యాటరీ
ధర రూ. 7999 

ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా ఈ నెల 11వ తేదీ నుంచి విక్రయానికి లభ్యం. కొనుగోలు చేసిన యూజర్లకు జియో రూ.2200 విలువైన  ఆఫర్స్‌ను కంపెనీ అందివ్వనుంది. అలాగే రూ.1500 విలువైన మేక్ మై ట్రిప్, రూ.2వేల విలువైన జూమ్ కార్ కూపన్లు జియో నుంచి లభిస్తాయి. అందుకు గాను యూజర్లు రూ.299 ప్లాన్‌ను రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top