రూ.15వేలకే ఐఫోన్‌, ఐప్యాడ్లు

You can buy these Apple iPhones, iPads at Rs 15,000 - Sakshi

న్యూఢిల్లీ : మరికొన్ని రోజుల్లో ప్రేమికుల దినోత్సవం రాబోతుంది. మీ ప్రియమైన వారికి ఆపిల్‌ డివైజ్‌తో సర్‌ప్రైజ్‌ చేయాలని అనుకుంటున్నారా? అయితే మీకో గుడ్‌న్యూస్‌.  ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఆపిల్‌ ఐఫోన్‌, ఐప్యాడ్‌ మోడల్స్‌పై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డుల ద్వారా అధికారిక డీలర్ల వద్ద ఆపిల్‌ డివైజ్‌ను కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లకు 10వేల రూపాయల వరకు క్యాష్‌బ్యాక్‌ అందిస్తోంది. ఈ ఆఫర్‌ కేవలం ఈఎంఐ లావాదేవీలకు మాత్రమే అందుబాటులో ఉండనున్నట్టు పేర్కొంది. 
 

ఐఫోన్లపై డిస్కౌంట్లు :
ఐఫోన్ ఎస్‌ఈ, ఐఫోన్ ‌6 పై 7 వేల రూపాయల క్యాష్ బ్యాక్ ఇస్తోంది. ఇది కేవలం హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్, క్రెడిట్ కార్డులపై మాత్రమే కొనుగోలు చేయాలి. అది కూడా ఈఎంఐ రూపంలోనే వర్తిస్తుంది. ప్రస్తుతం ఐఫోన్ ఎస్‌ఈ (32GB) రూ.22వేలుగా ఉంది. 7 వేల రూపాయల క్యాష్‌బ్యాక్‌తో రూ.15వేలకే ఐఫోన్ ఎస్‌ఈ లభిస్తోంది. ఐఫోన్ 6 పైన కూడా ఇదే విధమైన ఆఫర్ అందిస్తోంది. 
 

ఐపాడ్స్‌పై భారీ ఆఫర్లు :
ఐప్యాడ్‌, ఐప్యాడ్‌ మినీ 4, ఐప్యాడ్‌ ప్రొ ఈఎంఐ లావాదేవీలపై రూ.10వేల వరకు క్యాష్‌బ్యాక్‌ను హెచ్‌డీఎఫ్‌సీ ఆఫర్‌ చేస్తోంది. దీంతో 9.7 అంగుళాల వై-ఫై ఓన్లీ మోడల్‌ ఐప్యాడ్‌(32జీబీ స్టోరేజ్‌) అత్యంత తగ్గింపుకు వస్తోంది. ప్రస్తుతం రూ.25వేలకు విక్రయిస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్‌, 10వేల రూపాయల క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌తో కేవలం రూ.15వేలకు మాత్రమే లభిస్తోంది.

ఐఫోన్ షోరూమ్‌లు, ప్రముఖ మొబైల్ షాపుల్లో హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్, క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసిన వారికి మాత్రమే ఈ డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి. ఫిబ్రవరి 14వ తేదీ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రకటించింది. ఇటీవల ఇదే రకమైన క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ను ఐఫోన్‌ ఎక్స్‌, ఐఫోన్‌ 8, ఐఫోన్‌ 8 ప్లస్‌లపై కూడా హెచ్డీఎఫ్‌సీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ డివైజ్‌ను ఈఎంఐ లావాదేవీల ద్వారా కొనుగోలు చేసిన కస్టమర్లకు క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. ఈ ఆఫర్‌ 2018 మార్చి 11 వరకు అందుబాటులో ఉంటుంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top