4 రూపాయలకే ఎంఐ టీవీ, రెడ్‌మి స్మార్ట్‌ఫోన్లు | Xiaomi To Sell Redmi Note 5 Pro, Mi TV, Redmi Y2 For Rs 4 | Sakshi
Sakshi News home page

4 రూపాయలకే ఎంఐ టీవీ, రెడ్‌మి స్మార్ట్‌ఫోన్లు

Jul 9 2018 6:55 PM | Updated on Jun 4 2019 6:39 PM

Xiaomi To Sell Redmi Note 5 Pro, Mi TV, Redmi Y2 For Rs 4 - Sakshi

న్యూఢిల్లీ : భారత ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల మార్కెట్‌లో సంచలనాత్మక బ్రాండ్‌గా షావోమికి పేరొంది. ఈ కంపెనీ బడ్జెట్‌ ధరల్లో స్మార్ట్‌ఫోన్లు, టెలివిజన్లను లాంచ్‌ చేస్తూ భారతీయ వినియోగదారులను తెగ ఆకట్టుకుంటోంది. దిగ్గజ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలకు సైతం చెక్‌ పెడుతోంది. ఈ కంపెనీ మన మార్కెట్‌లోకి ప్రవేశించి రేపటికి నాలుగేళ్లు పూర్తవుతుంది. జూలై 10న మంగళవారం ఈ కంపెనీ గ్రాండ్‌గా తన నాలుగో వార్షికోత్సవాన్ని సెలబ్రేట్‌ చేసుకుంటుంది. ఈ సందర్భంగా ఎంఐ అభిమానుల కోసం షావోమి ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఎంఐ.కామ్‌లో జులై 10న ప్రారంభమయ్యే ఈ వార్షికోత్సవ సేల్‌ 12 వరకూ కొనసాగనుంది. ఎంఐ నాలుగో వార్షికోత్సవం సందర్భంగా అందిస్తున్న ప్రత్యేక ఆఫర్‌లో 55 అంగుళాల ఎంఐ ఎల్‌ఈడీ స్మార్ట్‌ టీవీని, రెడ్‌మి వై2 (3జీబీ+32జీబీ)ను, రెడ్‌మి నోట్‌ 5 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం నాలుగు రూపాయలకే కొనుగోలు చేసుకోవచ్చు. 10, 11, 12వ తేదీల్లో సాయంత్రం 4 గంటలకు లక్కీ కస్టమర్లకు కేవలం నాలుగు రూపాయలకే ఈ ఉత్పత్తులు లభిస్తాయి.

ఒకవేళ సాయంత్రం నాలుగు గంటలకు ఫ్లాష్‌ సేల్స్‌ అవకాశం చేజారిపోతే, కోంబోలో సాయంత్రం ఆరు గంటలకు రెడ్‌మి నోట్‌ 5ను, ఎంఐ వీఆర్‌ ప్లే 2ను కేవలం రూ.9,999కే అందించనున్నట్టు షావోమి తెలిపింది. వీటి అసలు ధర రూ.11,298గా ఉంది. రెడ్‌మి వై1, ఎంఐ బ్లూటూత్‌ హెడ్‌సెట్‌లను కూడా 8,999 రూపాయలకే కొనుగోలు చేసుకోవచ్చని, ఎంఐ ఎయిర్‌ ప్యూరిఫైయర్‌ 2ను 8,999 రూపాయలకే అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపింది.

మధ్యాహ్నం 12 గంటలకు ఎంఐ ఆఫర్స్‌...
మధ్యాహ్నం 12 గంటలకు బ్లాక్‌బస్టర్‌ ఆఫర్‌ కింద ఎంఐ ఎల్‌ఈడీ స్మార్ట్‌టీవీని రూ.13,999కు, రెడ్‌మి నోట్‌ 5 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ను రూ.14,999కు విక్రయించనున్నట్టు షావోమి తెలిపింది. 

ఇక ఎంఐ మిక్స్‌2, ఎం మ్యాక్స్‌‌2లపై కూడా రాయితీని అందిస్తోంది. ఎస్‌బీఐ, పేటీఎం, మొబిక్విక్‌ల ద్వారా చెల్లింపులు చేసేవారు అదనంగా ఇంకొంత రాయితీని పొందవచ్చు. ఎస్‌బీఐ కార్డు ద్వారా కనీసం రూ.7,500 లావీదేవీపై రూ.500 రాయితీ అందించనుండగా, రూ.8,999 కొనుగోలుపై పేటీఎం ద్వారా చెల్లింపు చేసిన వారికి రూ.500 క్యాష్‌బ్యాక్‌, విమాన టికెట్ల బుకింగ్‌పై రూ.1,000, సినిమా టికెట్లపై రూ.200 రాయితీని షావోమి అందిస్తుంది. ఇక మొబిక్విక్‌ ద్వారా చెల్లింపు చేసేవారు 25శాతం వరకూ(రూ.2,500 సూపర్‌ క్యాష్‌) డిస్కౌంట్‌ లభిస్తుంది.

ఎంఐ మిక్స్‌2 రూ.27,999(అసలు ధర రూ.29,999), ఎంఐ మ్యాక్స్‌‌2 రూ.14,999(అసలు ధర రూ.15,999) ట్రావెల్‌ బ్యాక్‌ప్యాక్‌ రూ.1,899(ఎంఆర్‌పీ రూ.1,999), ఎంఐ ఇయర్‌ఫోన్స్‌ రూ.649(అసలు ధర రూ.699) ఎంఐ బ్యాండ్‌ 2 రూ.1,599(ఎంఆర్‌పీ రూ.1,799) అందిస్తోంది.  ఎంఐ ట్రావెల్‌ బ్యాక్‌ప్యాక్‌(రూ.1,999)కు, ఎంఐ బ్యాండ్‌ హెచ్‌ఆర్‌ఎక్స్‌ ఎడిషన్‌(రూ.1,299) ఎంఐ బ్యాండ్‌ స్ట్రిప్‌ బ్లూ(రూ.199) రెండింటినీ రూ.1,398 అందించనున్నట్టు షావోమి తెలిపింది. వీటితో పాటు ఇతర గ్యాడ్జెట్స్‌పై కూడా రాయితీని, కూపన్లను ఆఫర్‌ చేస్తుంది.

Advertisement
 
Advertisement
Advertisement