5 నిమిషాల్లో రూ. 200 కోట్లు

Xiaomi Poco F1 earns over Rs 200 crore under 5 minutes - Sakshi

చైనా మొబైల్‌ తయారీదారు షావోమీ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో ఎదురులేని రారాజులా దూసుకుపోతోంది.  ఇటీవల పోకో సబ్‌బ్రాండ్‌ ద్వారా లాంచ్‌ చేసిన పోకో ఎఫ్‌ 1 అపూర్వమైన సేల్స్‌ను నమోదు చేసింది.  ఆగస్టు 29న ఫ్లిప్‌కార్ట్‌, ఎంఐ.కాం ద్వారా నిర్వహించిన ఫ్లాష్‌ సేల్‌లో  కళ్లు తిరిగే ఆదాయాన్ని ఆర్జించింది. కేవలం ఐదు నిమిషాల్లో రూ. 200 కోట్ల విలువైన  షావోమి పోకో ఎఫ్‌ 1  ఫోన్లు విక్రయించింది. 

పోకో ఎఫ్‌ 1 మొదటి ఫ్లాష్‌సేల్‌లో​ భారీ విక్రయాలను సాధించామని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఇది  బిగ్గెస్ట్‌, ఫాస్టెస్ట్‌ సేల్‌  అని పేర్కొంది. అలాగే  తదుపరి ఫ్లాష్‌సేల్‌  సెప్టెంబరు 5న  ఉంటుందని ప్రకటించింది. అయితే విక్రయించిన స్మార్ట్‌ఫోన్ల సంఖ్యను సంస్థ అధికారికంగా వెల్లడించకపోయినప్పటికీ టాప్ వేరియంట్ స్మార్ట్‌ఫోన్‌లో 68వేల యూనిట్లను,  1 లక్షల దాకా బేస్ వేరియంట్‌ డివైస్‌లను వినియోగదారులు కొనుగోలు చేసినట్టు అంచనా.

కాగా పోకో ఎఫ్‌ 1 స్మార్ట్‌ఫోనును మూడు స్టోరేజ్‌ ఆప్షన్లలో లాంచ్‌ చేసిన సంగతి తెలిసిందే.  6జీబీర్యామ్‌/64  స్టోరేజ్‌ (బేస్ వేరియంట్‌) ధర .20,999 గానూ,  6జీబీర్యామ్‌/128 స్టోరేజ్‌ (రెండవ వేరియంట్)ధర 23,999 రూపాయలుగాను, 8జీబీర్యామ్‌/256 స్టోరేజ్‌ (టాప్‌ ఎండ్‌ వేరియంట్‌) రూ .28,999గా నిర్ణయించింది. దీంతో పాటు స్పెషల్‌ ఎడిషన్‌ రెడ్‌ వేరియంట్‌ రూ. 29,999 ధరలో వినియోగదారులకు అందుబాటులో ఉంచింది.  ప్రారంభ అమ్మకాల్లోనే  బ్రేకింగ్ రికార్డులతో  దూసుకుపోతున్నషావోమి సబ్‌బ్రాండ్‌ పోకో  గ్లోబల్‌ మార్కెట్‌లో లాంచింగ్‌ అనంతరం భారీ ప్రభావాన్నే చూపనుందని  మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top