ఎంఐ మ్యాక్స్‌ 3 వచ్చేసింది

Xiaomi Mi Max 3 With 5500mAh Battery, Up to 6GB RAM Launched - Sakshi

చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం షావోమి తన లేటెస్ట్‌ బడ్జెట్‌ ఫాబ్లెట్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చేసింది. ఎంఐ మ్యాక్స్‌3ను చైనా మార్కెట్‌లోకి ప్రవేశపెడుతున్నట్టు షావోమి ప్రకటించింది. ఎంఐ మ్యాక్స్‌ 2 సక్సెసర్‌గా 14 నెలల తర్వాత ఈ ఫాబ్లెట్‌ను తీసుకొచ్చింది. ఈ ఫాబ్లెట్‌కు 6.9 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే, 5500 బ్యాటరీ, డ్యూయల్‌ రియర్‌ కెమెరాలు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. డిస్‌ప్లే నాచ్‌ ఈ హ్యాండ్‌సెట్‌కు లేదు. డార్క్‌ బ్లూ, డ్రీమ్‌ గోల్డ్‌, మెటోరైట్ బ్లాక్ రంగుల్లో ఈ ఫాబ్లెట్‌ను రూపొందించింది. 

ఎంఐ మ్యాక్స్‌ 3 ధర, అందుబాటు
ఎంఐ మ్యాక్స్‌ 3 చైనాలో 1,699 సీఎన్‌వై(సుమారు రూ.17,300)గా కంపెనీ నిర్ణయించింది. ఇది బేస్‌ వేరియంట్‌ ధర. బేస్‌ వేరియంట్‌కు 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ ఉంది. 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ ఇన్‌బిల్ట్‌ స్టోరేజ్‌ కలిగిన మరో వేరియంట్‌ ధర 1,999 సీఎన్‌వై(సుమారు రూ.20,400)గా కంపెనీ నిర్ణయించింది. జూలై 20 నుంచి చైనాలో విక్రయానికి రానుంది.

ఎంఐ మ్యాక్స్‌ 3 స్పెషిఫికేషన్లు...
6.9 అంగుళాల ఫుల్‌ హెచ్డీ ప్లస్‌ డిస్‌ప్లే
క్వాల్‌కామ్‌ ఆక్టా-కోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 636 ఎస్‌ఓసీ
4 జీబీ/ 6 జీబీ ర్యామ్‌
వెర్టికల్‌ డ్యూయల్‌ రియర్‌ కెమెరా సెటప్‌
వెనుకవైపు 12 మెగాపిక్సెల్‌ ప్రైమరీ సెన్సార్‌, 5 మెగాపిక్సెల్‌ సెకండరీ సెన్సార్‌
8 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా
మైక్రో ఎస్డీ కార్డు ద్వారా 256 జీబీ వరకు ఎక్స్‌పాండబుల్‌ మెమరీ
డ్యూయల్‌ 4జీ వాయిస్‌ఓవర్‌ ఎల్‌టీఈ సపోర్టు
ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌
5500 ఎంఏహెచ్‌ బ్యాటరీ

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top