‘ఎంఐ ఏ 2’ ధరపై భారీ తగ్గింపు | Xiaomi Mi A2 Price in India Cut, Now Starts at Rs. 13,999 | Sakshi
Sakshi News home page

‘ఎంఐ ఏ 2’ ధరపై భారీ తగ్గింపు

Jan 7 2019 12:20 PM | Updated on Jan 7 2019 12:23 PM

Xiaomi Mi A2 Price in India Cut, Now Starts at Rs. 13,999 - Sakshi

షావోమి తీసుకొచ్చిన  ఎంఐ ఏ 2  స్మార్ట్‌ఫోన్‌ ధరను భారీగా తగ్గించింది.  ఈ మేరకు షావోమి ట్విటర్‌లో  వివరాలను షేర్‌ చేసింది. ఇంతకుముందెన్నడూ  లేని తగ్గింపును ఆఫర్‌ చేస్తున్నట్టు తెలిపింది.  ఎంఐ ఏ2 స్మార్ట్‌ఫోన్‌ రెండు వేరియంట్లపై ఈ తగ్గింపును వర్తింప చేయనుంది. 

ఎంఐ ఏ2 4జీబీ ర్యామ్‌, 64 జీబీ ధరను  రూ. 13, 999లకే అందిస్తోంది. ఎంఆర్‌పీ ధర రూ.17,999.
6జీబీర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ ధర 15,999 కే లభ్యమవుతోంది. అసలు ధర ధర రూ. 20,500. 

అమెజాన్‌, ఎం.కామ్‌ అన్‌లైన్‌ స్టోర్లతోపాటు, ఎంఐహోమ్‌ ఆఫ్‌లైన్‌ ద్వారా  ఈరోజు మధ్యాహ్నం 12గంటలకు  సేల్‌ ప్రారంభం.  ఇదే అతి పెద్ద హై ఫై (5) ప్రకటన అని షావోమి ఇండియా ట్వీట్‌ చేసింది.  ఇంకా ఇలాంటి ఆఫర్లను  ఇంకా నాలుగు  ప్రకటించనుంది.

Advertisement
 
Advertisement
Advertisement