breaking news
phablets
-
ఎంఐ మ్యాక్స్ 3 వచ్చేసింది
చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి తన లేటెస్ట్ బడ్జెట్ ఫాబ్లెట్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చేసింది. ఎంఐ మ్యాక్స్3ను చైనా మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నట్టు షావోమి ప్రకటించింది. ఎంఐ మ్యాక్స్ 2 సక్సెసర్‌గా 14 నెలల తర్వాత ఈ ఫాబ్లెట్‌ను తీసుకొచ్చింది. ఈ ఫాబ్లెట్‌కు 6.9 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, 5500 బ్యాటరీ, డ్యూయల్ రియర్ కెమెరాలు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. డిస్ప్లే నాచ్ ఈ హ్యాండ్‌సెట్‌కు లేదు. డార్క్ బ్లూ, డ్రీమ్ గోల్డ్, మెటోరైట్ బ్లాక్ రంగుల్లో ఈ ఫాబ్లెట్‌ను రూపొందించింది. ఎంఐ మ్యాక్స్ 3 ధర, అందుబాటు ఎంఐ మ్యాక్స్ 3 చైనాలో 1,699 సీఎన్‌వై(సుమారు రూ.17,300)గా కంపెనీ నిర్ణయించింది. ఇది బేస్ వేరియంట్ ధర. బేస్ వేరియంట్‌కు 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఉంది. 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ కలిగిన మరో వేరియంట్ ధర 1,999 సీఎన్‌వై(సుమారు రూ.20,400)గా కంపెనీ నిర్ణయించింది. జూలై 20 నుంచి చైనాలో విక్రయానికి రానుంది. ఎంఐ మ్యాక్స్ 3 స్పెషిఫికేషన్లు... 6.9 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే క్వాల్కామ్ ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 636 ఎస్ఓసీ 4 జీబీ/ 6 జీబీ ర్యామ్ వెర్టికల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ వెనుకవైపు 12 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 5 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా మైక్రో ఎస్డీ కార్డు ద్వారా 256 జీబీ వరకు ఎక్స్‌పాండబుల్ మెమరీ డ్యూయల్ 4జీ వాయిస్ఓవర్ ఎల్టీఈ సపోర్టు ఫింగర్ ప్రింట్ సెన్సార్ 5500 ఎంఏహెచ్ బ్యాటరీ -
హెచ్‌పీ.. వాయిస్ ట్యాబ్లెట్లు వస్తున్నాయ్
వాషింగ్టన్: పర్సనల్ కంప్యూటర్ల తయారీ సంస్థ హ్యులెట్-ప్యాకార్డ్ భారత వినియోగదారుల కోసం వినూత్నమైన వాయిస్ ట్యాబ్లెట్లను అందిస్తోంది. 6,7 అంగుళాల స్క్రీన్లు ఉన్న ఈ వాయిస్ ట్యాబ్లెట్లు- హెచ్‌పీ స్లేట్ 6, హెచ్‌పీ స్లేట్ 7లను వచ్చే నెలలో భారత్‌లో విడుదల చేస్తామని కంపెనీ పేర్కొంది. ఆండ్రాయిడ్ ఓఎస్‌పై పనిచేసే ఈ డివైస్‌లను పవర్ఫుల్ క్వాడ్ కోర్ ప్రాసెసర్‌తో రూపొందించామని తెలిపింది. 3జీ, డ్యుయల్ సిమ్, డ్యుయల్ స్టాండ్‌బై, రియర్, ఫ్రంట్ కెమెరా ఫీచర్లున్న ఈ వాయిస్ ట్యాబ్లెట్లను మల్టీ టాస్కింగ్ చేసే యూజర్ల కోసం అందిస్తున్నామని పేర్కొంది. కాగా మొబైల్ ఫోన్, ట్యాబ్లెట్ల ఫీచర్లున్న డివైస్ల కోసం వినియోగదారులు చూస్తున్నారని, వాయిస్ ట్యాబ్లెట్ల మార్కెట్ జోరుకు ఇదే చోదక శక్తి కానుందని హెచ్‌పీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్(కన్సూమర్ పర్సనల్ సిస్టమ్స్ గ్రూప్) రాన్ కాఫ్లిన్ పేర్కొన్నారు.