షావోమి ఎంఐ 6ఎక్స్‌ లాంచ్‌, ఫీచర్లివే!

Xiaomi Mi 6X (Mi A2) With Dual Rear Cameras Launched - Sakshi

గత ఎన్నో రోజుల నుంచి మార్కెట్‌లో చక్కర్లు కొడుతున్న షావోమి నయా స్మార్ట్‌ఫోన్‌ ఎంఐ 6ఎక్స్‌ మార్కెట్‌లోకి వచ్చేసింది. యుహాన్‌ యూనివర్సిటీలో జరిగిన ఈవెంట్‌లో సీఈవో లీ జున్‌ ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేశారు. త్వరలోనే ఈ స్మార్ట్‌ఫోన్‌ దేశీయ మార్కెట్‌లోకి కూడా రానుంది. ఇదే డిజైన్‌, కెమెరాలో ఏఐ ఇంటిగ్రేషన్‌, ఆండ్రాయిడ్‌ 8.1 ఓరియా ఆధారిత కస్టమ్‌ స్కిన్‌లతో ఎంఐ ఏ2గా ఈ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి తీసుకురావాలని షావోమి చూస్తోంది. ఎంఐ ఏ2 లాంచ్‌ చేయనున్న సందర్భంగా ఇప్పటికే భారత్‌లో ఎంఐ ఏ1 స్మార్ట్‌ఫోన్‌ అవుటాఫ్‌ స్టాక్‌ అయింది. 

ఎంఐ 6 ఎక్స్‌(ఎంఐ ఏ2) ధర
మూడు వేరియంట్లలో ఈ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ అయిఅంది. ఒకటి 4జీబీ ర్యామ్‌, 32జీబీ స్టోరేజ్‌ ఆప్షన్‌, ధర 1,599 సీఎన్‌వై(సుమారు రూ.16,900). రెండోది 4జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్‌, ధర 1,799 సీఎన్‌వై(సుమారు రూ.19,000). టాప్‌ ఎండ్‌ ఎంఐ 6ఎక్స్‌ వేరియంట్‌ 6జీబీ ర్యామ్‌, 128జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ను కలిగి ఉంది, ధర 1,999 సీఎన్‌వై(సుమారు రూ.21వేలు). ఏప్రిల్‌ 27 శుక్రవారం అక్కడి కాలమానం ప్రకారం ఉదయం 10 గంటల నుంచి చైనాలో ఈ స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులోకి వస్తుంది.

ఎంఐ 6ఎక్స్‌(ఎంఐ ఏ2) స్పెషిఫికేషన్లు...
5.99 అంగుళాల డిస్‌ప్లే
ఆండ్రాయిడ్‌ 8.1 ఆధారిత ఎంఐయూఐ 9.5 సాఫ్ట్‌వేర్‌
ఆక్టా-కోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 660 ఎస్‌ఓసీ
20 మెగాపిక్సెల్‌ సెల్ఫీ కెమెరా
12 మెగాపిక్సెల్‌, 20 మెగాపిక్సెల్స్‌తో వెనుకవైపు డ్యూయల్‌ కెమెరాలు
ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌తో పాటు ఫేస్‌ అన్‌లాక్‌ ఫంక్షన్‌
3010 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం
రెడ్‌, గోల్డ్‌, రోజ్‌ గోల్డ్‌, బ్లూ, బ్లాక్‌ రంగుల్లో అందుబాటు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top